calender_icon.png 1 March, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం దందాకు చెక్ పడేనా?

01-03-2025 12:00:00 AM

కొంతమంది రేషన్ డీలర్ల, లబ్ధిదారుల నుంచి కొనుగోలు

పట్టుబడితే మామూలు కేసులు.. లేకుంటే కాసుల వర్షం 

రేషన్ బియ్యంవల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన శూన్యం 

గతంలో మనుషులు శారీరక శ్రమను నమ్ముకుని జీవితం కొనసాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శారీరక శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయంను సంపాదించాలన్నదే కొంతమందిలో వస్తున్న ఆలోచన. సులువుగా డబ్బులు సంపాదించాలంటే రేషన్ బియ్యం కాసుల వర్షాన్ని కురిపిస్తుందని చాలా మంది రేషన్ బియ్యం దందాను చేస్తున్నారు. నెలలో మొదటి రెండు వారాలు ఇచ్చే రేషన్ బియ్యం ను కొంతమంది రేషన్ డీలర్లు, లబ్ధిదారులను మచ్చిక చేసుకుని వారి నుండి సేకరించి రేషన్ బియ్యం కావాల్సిన బడా వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తూ మూడు రేషన్ బియ్యం బ్యాగులు ఆరు నోట్ల కట్టల మాదిరిగా కాసుల (రేషన్) బియ్యం దందా ను కొనసాగిస్తున్నారు. 

వనపర్తి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) :  వనపర్తి, గద్వాల జిల్లాలలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు బియ్యం సంచులు ఆరు నోట్ల కట్టలు లాగా కొనసాగుతుంది.  గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కొంతమంది రేషన్ డీలర్లు, లబ్ధిదారుల నుండి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని దళారులు అధిక ధరలకు ఇతర ప్రాంతాలకు, కొన్ని రైస్ మిలర్లకు యదేచ్చగా చేర వేస్తున్నారు.  కొంతమంది రైస్ మిలర్లు రేషన్ బియ్యంను రీ సైక్లింగ్ చేస్తున్నారని బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అమాయక ప్రజల నుంచి కిలోకు రూ.10 నుండి 12 లాగా కొనుగోలు చేసి అధిక ధరలకు రూ.25 నుండి 30 వరకు విక్రయాలను చేస్తూ దళారులు దందాను యదేచ్చగా కొనసాగిస్తున్నారు. 

పట్టుబడితే మాములు కేసులు.. లేకుంటే కాసుల వర్షం.. 

జిల్లాలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా  తరలిస్తున్న వారిని పట్టుకుంటున్నారు కానీ  అవి ఎక్కడ నుండి తెస్తున్నారన్న మూలలలోకి మాత్రం అధికారులు వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.  పట్టపగలే దళారులు రేషన్ బియ్యం కొనుగో లు చేస్తున్న అధికారులు చూస్తూ ఎందుకు మౌనంగా ఉంటున్నారే తప్ప ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని విమ ర్శలు ఉన్నాయి. రేషన్ బియ్యం తరలిస్తూ పట్టుబడిన సమయంలో  మామూలు కేసులు.. లేదంటే కాసుల వర్షం కురు స్తుందని కొంతమంది దళారులు యథేచ్ఛగా రేషన్ దందా ను నిర్వహిస్తున్నారు. 

సంక్షేమ పథకాల కోసమేనా తెల్ల రేషన్ కార్డు..? 

దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న వారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులను ప్రభుత్వం అందజేస్తుంది దీని ద్వారా పేద ప్రజలకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తుంది. ఆర్థిక స్తోమత బాగానే ఉన్న  కుటుంబాలు సైతం తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులను  కేవలం తెల్లరేషన్ కార్డు ప్రభుత్వ సంక్షే మ పథకాలు కులం ఆదాయం ఆసరా పింఛన్లు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల పొందడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.  కానీ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఉచితంగా సరఫరా అవుతున్న బియ్యాన్ని మాత్రం తినడం లేదు. రేషన్ బియ్యం క్వింటాళ్లకొద్ద్దీ అధికారులకు పట్టుబడినా.. రవాణా చేసే దళారులు మాత్రం రేషన్ దందాను ఆపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

రేషన్ బియ్యం వల్ల కలిగే ఉపయోగాలపై అవగాహన శూన్యం..

నిరుపేద ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ బియ్యం లో పలు పౌష్టిక పోషకాలు కలిగి ఉంటాయి. చాలావరకు విటమిన్ సమస్య లను పూర్తిగా ప్రాలదోలే దిశగా కేర్నల్స్ ను కలుపుతారు. ఈ విషయం పై అధికారులు ప్రజలకు అవగహన విఫలం అయ్యారు. ఇన్ని పౌస్టికాలు కలిగిన బియ్యంను దళారులకు అమ్మేసి రోగాలు వస్తే ఆసుపత్రి లో వందల వేల రూపాయలను ఖర్చు చేసుకుంటున్నారు.