calender_icon.png 18 April, 2025 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడని టోల్ ప్లాజా కిరికిరి?

10-04-2025 12:11:17 AM

  1. భిక్కనూరులో స్థానికులకు  టోల్ మినహాయింపు రద్దు
  2. యాజమాన్యం మార్పుతో ఇక్కట్లు 
  3. ఆందోళన చేస్తామని స్థానికుల హెచ్చరిక
  4. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

కామారెడ్డి, ఏప్రిల్09 (విజయ క్రాంతి), 44వ జాతీయ రహదారిపై భిక్కనూరు వద్ద ఏర్పాటుచేసిన టోల్ ప్లాజా నిర్వాహకులు గత 20 సంవత్సరాలుగా స్థానిక వాహనదారులకు రోడ్ టాక్స్ కట్టకుండా మీనాయింపు ఇచ్చారు. జర్నలిస్టులకు సైతం అక్రిడేషన్ కార్డు చూస్తే వానాలపై వెళ్లేందుకు ఉచితంగా అనుమతి ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా స్థానికులకు జర్నలిస్టులకు టోల్ ట్యాక్స్ చెల్లించకుండానే ఉచితంగా టోల్ ప్లాజా గురించి పంపించారు.

ఇటీవల కొత్త యాజమాన్యం టోల్ ప్లాజా ను లీజుకు తీసుకొని స్థానికులు జర్నలిస్టులు సైతం టోల్ ప్లాజా ఫీజు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. గత 20 సంవత్సరాలుగా తాము టోల్ ప్లాజా నిర్మించే ముందు లోకల్ వాళ్లకు ఫ్రీగా అనుమతి ఇవ్వాలని మాట్లాడుకోవడం జరిగింది. పాత యజమాన్యం స్థానిక రైతులకు వాన దారులకు జర్నలిస్టులకు ఫ్రీగా అనుమతి ఇచ్చారు.

ఇటీవల కొత్త యజమాన్యం వచ్చి గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న టోల్ ప్లాజా సిబ్బందిని తొలగిస్తామని నైపుణ్యత లేదంటూ సాకులు చూపి ఉద్యోగాల నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా స్థానిక గ్రామాల ప్రజలు రైతులు జర్నలిస్టులు కొత్త యజమాన్యం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

ఉన్నతాధికారులతో మాట్లాడి గతంలో లాగా ఇలాంటి ఫీజు వసూలు చేయకుండా ఫ్రీగా అనుమతిస్తామని చెప్పిన యజమాన్యం మాట మార్చేసింది. టోల్ ప్లాజా వద్ద నుంచి వెళ్లే ప్రతి వాహనానికి నన్ను చెల్లించాల్సిందేనని నిర్వహకులు కరాకండిగా చెప్తున్నారు.

కనీస నిబంధనలు కరువు

కామారెడ్డి జిల్లా బిక్కనూరు వద్ద నిర్మించిన టోల్ ప్లాజా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికుల కు ఆ సౌకర్యంగా కలిగిస్తున్నారు. నిబంధనలను పాటించేవారిపై దాడులకు సైతం దిగజారుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షబ్బీర్ అలీ కి సైతం సమస్యను విన్నవించారు. కాంట్రాక్టర్ కక్కుర్తి తనం వల్ల టోల్ ప్లాజా వద్ద నిత్యం ప్రయాణికులు అవస్థలు పడడమే కాకుండా టోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టు పొందినవారు పైసల పై ఉన్న ధ్యాస కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్రక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే 20 గ్రామాల రైతులు స్థానికులకు టోల్ టాక్స్ రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పట్టడమే కాకుండా టోల్ ప్లాజా ను తొలగించే వరకు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని రైతులంటున్నారు వాన దారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

నీటి సౌకర్యం లేదు వాహనాలకు గాలి నెంబరు ఎండ వేడిమి వాన దారులకు తగలకుండా ఏర్పాటు చేయడం లేదు. టోల్ ప్లాజా లో కనీస నిబంధనలు పాటించాల్సిన యజమానులు కాంట్రాక్టర్ తీసుకున్నప్పుడు అన్ని వసతులు సమకూరుస్తామని అగ్రిమెంట్ చేసుకొని నిర్వహణ కొనసాగిస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు పట్టుకున్న వ్యక్తి తన ఇష్టానుసారంగా తమ ఇబ్బందితో వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు చొరవ చూపి టోల్ ప్లాజాలో ఉండవలసిన కనీస సౌకర్యాలు వసతులు కల్పించాలని ప్రజలు వాహన దారులు కోరుతున్నారు. గతంలో టోల్ ప్లాజా ఎరువకులు ఇలాంటి ఇబ్బందులు పెట్టలేదని అధికారులు గ్రహించి స్థానికులకు టోల్ ప్లాజా నుంచి వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని స్థానిక ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యే కా టిపల్లి వెంకట రమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు షబ్బీర్ అలీ చొరవ తీసుకొని ఎంపీ సురేష్ రెడ్డి సహకారంతో టోల్ ప్లాజా వద్ద కనీస వసతులను సమకూర్చాలని స్థానికులు కోరుతున్నారు. విషయంపై స్థానిక కాంగ్రెస్ నాయకులకు వినతి పత్రాన్ని అందజేశారు.