calender_icon.png 23 December, 2024 | 10:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార హక్కు ఇక హుళక్కేనా?

19-10-2024 12:00:00 AM

మాడభూషి శ్రీధర్ :

మళ్లీ ఆర్టీఐ గందరగోళంలో పడిపోయిందా?ఆంధ్రప్రదేశ్‌లో ఏమవుతున్నది? మన దేశంలో అక్టోబర్ 12న సమాచార హక్కు అమలు ప్రారంభమైతే, ప్రపంచ దేశాల వారికి తెలుసుకునే హక్కు సెప్టెంబర్ 28న మొదలైంది. సమాచార హక్కు దినోత్సవాన్ని ఆ రోజు అంత ర్జాతీయంగా నిర్వహిస్తారు. మన దేశంలో సమాచార హక్కు చట్టం వచ్చి ఈనెల అక్టోబర్ 12నాటికి 19 సంవత్సరాలు గడచిపో యింది.

ఈ నేపథ్యంలో అసలు సమాచార హక్కు కొనసాగేనా’ అనే అయోమయ మూ నెలకొంది. మనం -‘ప్రమాణాలు’ అంటుంటాం. ‘ఓత్’ అంటే ‘ప్రమాణం’ అనుకుంటాం. మామూలు భాషలో ఒట్టు. ఈమధ్య తిట్టే కనుక ఒట్టు గుర్తు రాదు. అధికారానికి చేరినపుడు ప్రమాణం గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది?

ఓత్ అంటే ఒట్టు? 

‘ప్రస్తుతమున్న సహాయ నిరాకరణ ధోరణి, తప్పుడు ప్రవర్తనవల్ల మన హక్కు కు ప్రమాదం వస్తున్నది.  ప్రమాణ (ఓత్ టేకింగ్) ఉల్లంఘన గమనించండి. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సమా చార హక్కు చట్టం- 2005 స్ఫూర్తిని కాపాడండి’ అన్నది ఎవరో విమర్శిస్తున్న ప్రక టన కాదు. స్వయంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (ఎపి రాష్ట్ర సీఐసీ) ఆర్. మహబూబ్ బాషా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి నివేదిక ఇవ్వడం తీవ్రమైన అంశం.

సమాచార హక్కుకు తూట్లు

ఇప్పుడు 10 వేల ఆర్టీఐ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే దేశం మొత్తం మీద 2023 జులై 30 నాటికి పెండింగ్‌లో 3 లక్షల 88 వేల 886 కేసులు సమాచారం కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసారి సమాచార హక్కు హుళక్కి అయిపోతుందేమో అని భయమవుతున్నది. తెలంగాణలోనూ ఒక్క సమా చార కమిషనర్ కూడా లేకుండా సమాచా ర చట్టం, హక్కు ఉన్న పరిస్థితి.

విచిత్రమేమంటే ఉదయం పదిన్నర గంటలకూ రెండో అప్పీల్ విచారణ చేయడానికి కమిషనర్లు రావాలని, తప్పకుండా రావాలనీ, రాకపోతే సెలవు చెప్పుకోవాలని, రోజూ కొన్ని కేసులైనా విచారణ చేయాలని చీఫ్ కమిషనర్ అడగడమే ఆశ్చర్యం. మన దేశంలో, మన రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇదొక అన్యాయం.

మొత్తం మీద ‘కనీసం ఆరు గంటలు పనిచేయండి సార్’ అని బతిమాలుకోవలసి వస్తున్నది. ఆ విధంగా ఆజ్ఞ జారీ చేయాల్సి ఉంది. అది అమలు చేయడం లేదు కనుక గవర్నర్‌కే ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఇంకేమనగలం?

జీతం ఆపే ప్రమాదమా?

సమాచార కమిషనర్లు కార్యాలయానికి వచ్చి, హాజరు నమోదు చేయకపోతే వారి జీతాలు విడుదల చేయకూడదని ఇచ్చిన ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ బిల్లు లు ఇవ్వవలసి ఉంది. కాని అలా చేయలేదు. అందువల్ల 2024 ఆగస్టు 26న పెద్ద లు మరో అధికారితో వాగ్వాదానికి దిగా రు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమా ల్లో కనిపించడం ఆశ్చర్యం.

లక్షల రూపాయల వేతనాలు తీసుకునే వారెవరైనా సరే, వారి విద్యుక్త కార్యాలు నిర్వహించాలి కదా. ఈ ఫిర్యాదులో చేసిన ఆరోపణలో రాష్ట్ర సమాచార కమిషనర్‌కు మినహాయింపులు పోనూ నెలకు రూ.3.50 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అంటే, రోజు కు దాదాపు రూ.11 వేలు. నెలలో వీరు పని చేయాల్సింది 22 రోజులు మాత్రమే.

ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో వేతనాలు పొందుతూ కూడా కార్యాలయాలకు సరి గ్గా రావడం లేదు. ఆర్టీఐ అమలులోనూ లోపాలపై స్వచ్ఛంద సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయని, వీరి ప్రవర్తనలో మార్పు కోసం ఏడాదిగా ఎదురు చూసిన సీఐసీ మహబూబ్ బాషా చివరకు గవర్నర్‌కు నివేదిక పంపినారని  తెలుస్తోంది.

ఆర్టీఐని పటిష్టంగా, పారదర్శకంగా అమ లు చేయడంలో సభ్యులు సహకరించడం లేదని సీఐసీ అనుకుంటే, మాకున్న అధికారాన్ని సవాలు చేస్తూ ‘తమ పై అధికారివలె సీఐసీ తమకు ఆదేశాలివ్వడం చేస్తారా’ అని వ్యవహరిస్తున్నట్లు, వారి రోజువారీ విచారణలను వీడియో రికార్డింగ్ చేయడా న్ని వ్యతిరేకిస్తున్నారని, జిల్లా కలెక్టర్లతోపాటు ఇతర అధికారులను విచారించేం దుకూ ఇష్టపడటం లేదని అనేక అంశాలు బహిర్గతమైనాయి.

సుప్రీంకోర్టు విచారణ లు కూడా లైవ్‌లో చూపిస్తున్నారు. అందు కు సమాచార కమిషన్లు కూడా వీడియో లో జనానికి చూపడం మంచిదే. ఇదే పారదర్శకత.

నియమిత కాలవ్యవధి ఉందా?

సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) కింద దరఖాస్తుదారులు నిర్దేశించిన విధంగా నియమిత కాల వ్యవధిలో సమాచారం అందజేసేలా చర్యలు తీసుకోవా లని ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ ఆర్.మహబూబ్ బాషా ఆదేశించారు. అంటే 30 రోజుల్లోగా 6(1) దరఖా స్తులకు సమాచారం ఇస్తే దరఖాస్తుదారులకు అప్పీలుకు రావాల్సిన అవసరం చాలావరకు తగ్గిపోతుంది.

సెక్షన్ 4(1)బి కింద ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛందంగా తమ కార్యాలయాల సమాచారాన్ని సాధ్యమైనంతగా వెల్లడిస్తే చట్టంలోని కీలకమైన నియమాలు అమలవుతాయి. నిజ మే కదా. విధులకు సరిగా రావడం లేదనే కారణంపై సెప్టెంబర్ జీతభత్యాలు ఆపేయాలని, ఒక సందర్భంలో వేతనం ఇవ్వ ద్దనీ, ఇవ్వాలనీ వెంటవెంటనే చెప్పవలసి వచ్చింది. రాష్ట్ర సమాచార కమిషనర్లు నలుగురికి నెల జీతం ఇవ్వాలని స్వయం గా రాష్ట్ర ప్రభుత్వం వారే చెప్పాల్సి వచ్చింది. 

గవర్నర్‌కు సీఐసీ ఫిర్యాదు 

సమాచార కమిషన్ కార్యాలయంలోని అంతర్గత వ్యవహారాలు, కమిషనర్ల పనితీరుపై గవర్నర్ కార్యాలయానికి 2023 జూన్ 7న సీఐసీకి పంపించారు. ఈ పరిస్థితులపై వివరాలను రాష్ట్ర సమాచార కమి షనర్లు (ఐసీ)గా ఉన్న పి.శామ్యూల్, చావ లి సునీల్, రెహనా బేగం, డాక్టర్ అల్లారెడ్డి ఉదయభాస్కర్‌రెడ్డి గురించి ఈ నివేదికను రాష్ట్ర గవర్నర్‌కు పంపించారు.

అందులో ముఖ్యంగా చట్ట ప్రకారం చేయవలసింది ఏమిటో వివరించారు. స.హ చట్టం నివేదికలో సెక్షన్ 15 (4) ప్రకారం, ప్రధాన సమాచార కమిషనర్‌కు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారముంది. ఇతరులు జోక్యం చేసుకోకూడదు. తీవ్రమైన సమస్య ఏమంటే, కలిసి పని చేయవలసిన వారే విభేదించడం. దానికి ఉదా హరణ ఇది.

ముఖ గుర్తింపు విధానం (ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్: ఎఫ్‌ఆర్‌ఎస్)లో హాజరు నమోదుకు నిరాకరిస్తున్నారు. సీఐసీ ఆదేశాలకు తాము బద్ధులై ఉండాల్సిన అవసరం లేదని లేఖలు రాశారు. కమిషనర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి, కార్యకలాపాలన్నీ రికార్డు చేయాలని ఐటీ విభాగానికి తెలియజేయగా 2024 జనవరి నుంచి ఆ ఏర్పాట్లు చేశా రు.

సమాచార కమిషన్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రోస్టర్ ప్రకారం విచారణలు చేపట్టి, తర్వాత గంటపాటు మధ్యాహ్న భోజన విరామం తీసు కోవాలి. తిరిగి 2.30 నుంచి 5.30 వరకు మళ్లీ రోస్టర్ ప్రకారం పనిచేయాల్సి ఉం టుంది. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించినప్పుడు కమిషనర్లు ఈ సమయ పాలన పాటించలేదని తేలిందని సాధారణ బాధ్యతలను గురించి చెప్పవలసి వస్తున్నది. 

అంతేకాదు, ప్రథమ అప్పిలేట్ అధికారి ప్రత్యక్షంగా రావలసిన అవసరం లేదు. అడిగిన సమాచారం ఇవ్వడంతో చాలని, ఆన్‌లైన్ విధానాన్ని వినియోగించుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాచార కమిషన్‌లో ఈ విధానం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అప్పీలుదా రులు, ఫిర్యాదుదారులతోపాటు అధికారులకూ ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆన్‌లైన్ (వర్చువల్) విధానాన్ని అమలు చేస్తున్నామని సీఐసీ ప్రకటించారు.

అధికారులకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించే బాధ తప్పుతుందన్నారు. అంతేకాక, కమిషన్ ముందు విచారణకు హాజరు కావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, భత్యాలు ప్రభుత్వానికి మిగిల్చిన వారవుతారన్నారు. అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల అనే మారుమూల గ్రామంలో ఆదివాసీ గిరిజ న యువతను ఉద్దేశించి తాను ఇటీవల ప్రసంగించానని, వారినుంచి తాను, తననుంచి వారు సమాచార హక్కు చట్టంపై అభిప్రాయాలు తెలుసుకున్నామని ఆయనన్నారు.

అదే తాను కనుక అధికార పర్యటనకు వందల కిలోమీటర్ల దూరంలోని కొండకర్లకు వెళ్లి ఉంటే ప్రొటోకాల్ పేరుతో అధికారుల హడావుడి, వ్యయం జరిగి ఉండేదని, వాటిని నివారించేందుకే తాను ఆన్‌లైన్ (వర్చువల్) విధానాన్ని ఎంచుకున్నట్ల తెలిపారు. 

మరో ప్రధానమైన అంశం ఏమంటే, లంచాలు అడిగితే ఫిర్యాదు చేయాలని తక్షణమే తన దృష్టికి తేవాలని, అటువంటి సంఘటనలపై చర్యలు తీసుకుంటామని నోడల్ అధికారులతో రాష్ట్ర సీఐసీ ప్రకటించారు. 

తెలుగులో ఆర్డర్ ఇవ్వండి సార్!

తెలుగులో తీర్పులు ఇవ్వాలని ఆదేశా లు ఉండగా, నాతోపాటు ఒకరు మాత్రమే ఇది పాటిస్తున్నారని ప్రధాన సమాచార కమిషనర్ రాసారు. దరఖాస్తుదారులు తెలుగులో సమాచారం ఇవ్వాలని కోరినప్పుడు తెలుగులోనే ఖచ్చితంగా ఇవ్వాలని, ప్రథమ అప్పిలేట్ అధికారులు తెలుగులో తీర్పులు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

ఆహా... సాధికారత!

అవినీతిని అరికట్టడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని నిజమైన పరమార్థంలో ప్రజల కోసం పనిచేసేదిగా చేయించాలి. పాలనా సాధనాలపై అవసరమైన నిఘా ఉంచేందుకు, పాలించిన వారికి ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండేలా మెరు గు పరచాలి. ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు తెలియజేయడానికి ఈ చట్టం ఒక పెద్ద అడుగు అని అనుకున్నాం.

సమాచార హక్కు చట్టం ప్రాథమిక లక్ష్యం పౌరులకు సాధికారత కల్పించడమే. ప్రభుత్వ పనిలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం అనే చట్టం అమలు చేస్తున్నట్టుగా భావించవలసి ఉంది.  మన ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రత్యేకంగా రాసుకున్నది భారత రాజ్యాంగమని అంటున్నాం.

సుప్రీంకోర్టు రక్షించ డం వల్లనే ఈ హక్కు, అందులో మాట్లాడే హక్కు, తద్వారా తెలుసుకునే హక్కు రావాలనీ అనుకుంటున్నాం. కనీసం సమయా నికి ఆఫీసుకు ‘స్వాగతం కృష్ణా, సుస్వాగతం కృష్ణా’ అని ఆదేశాలు చేయవలసిన పరిస్థితి రావడమేమిటి? ఆఫీసుకు రావడమే ‘ఒక గుడ్ గవర్నన్స్’గా మారిపోయిం ది. ఇదీ మన పరిస్థితి.