calender_icon.png 8 April, 2025 | 5:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవు పాట ఆదాయానికి గండి?

08-04-2025 12:00:00 AM

  1. రూ.6.36 లక్షల పాత బకాయిలు
  2. గడువు ముగిసినా రేవులో పడవల ప్రయాణం
  3. 2025-26 ఆర్థిక సంవత్సరానికి పాట వాయిదా

చర్ల ఏప్రిల్  7 (విజయ క్రాంతి): అధికారుల అసమర్ధత.. అక్రమార్కులకు వరంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్దపల్లి పంచాయతీ రేవు పాట ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గతంలో పాట పాడిన వారు రూ.లక్షల్లో బకాయిలు ఉండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

2025 -26 ఆర్థిక సంవ త్సరానికి గాను పెద్దపల్లి పంచాయతీ రేవు పాట నిర్వహణ శుక్రవారం గందరగోళం నడుమ వాయిదా పడింది. వివరాల్లోకి వెళితే గత మూడేళ్లుగా రేవు పాట పాడిన పాటదారు లు గ్రామపంచాయతీకి డబ్బులు చెల్లించకుండా లక్షల్లో బకాయి ఉండటమే ఈ ఏడా ది రేవు పాట నిర్వాహనకు బ్రేక్ పడింది.

2022- 23 ఆర్థిక సంవత్సరానికి రూ 8.26 లక్షలకు రేవు పాట పాడిన పాటదారుడు రూ 5.70 లక్షల మాత్రమే చెల్లించారు. దీంతో సుమారు రూ2.56 బకాయి పడ్డారు. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి వేలంపాట నిర్వహించలేదు. 2024- 25 ఆర్థిక సంవత్సరంలో 6 నెలలకు గాను (అక్టోబర్ నుంచి మార్చి) వరకు నిర్వహించిన పాటను రూ 6.80 రేవు పాట పొందడం జరిగింది.

ఇప్పటివరకు కేవలం రూ 3 లక్షలు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ 3.80 లక్షల బకాయి ఉంది. దీంతో రెండు సంవత్సరాలకు గాను  మొత్తం రూ6.36 లక్షలు గ్రామపంచాయతీకి చెల్లించాల్సి ఉంది. మొత్తంలో బకాయలు ఉండటంతో గ్రామపంచాయతీ ఆదాయానికి భారీగా గండిపడింది.

మార్చుతోని రేవు పాట పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 సంవత్సరానికి గాను పాట నిర్వహించే క్రమంలో పాత బకాయిల వివరాలు తెలియడంతో గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో వేలం పాట సమయంలో గందరగోళం నెలకొంది. బకాయలు మొత్తం చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.దీంతో గ్రామపంచాయతీ కార్యదర్శి సామ్రాజ్యం వేలంపాట వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 

పాట కాలం పూర్తయిన గోదావరిలో పడవ

గత ఆర్థిక సంవత్సరంలో రేవు పాట పాడిన వ్యక్తికి మార్చి 31కి గోదావరి నదిపై పడవ నడిపి ఎందుకు నిర్ణీత కాలం పూర్తయింది. ఆయన పాత బకాయి చెల్లించ కుండా దర్జాగా గోదావరిలో పడవ నడుపుతూ అవినీతి అక్రమాలకు పాల్పడు తున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బకాయలు చెల్లించకుండా, అక్రమంగా పడవ నడిపే తనపై చర్యలు తీసుకోకుండా ఉన్న అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చర్ల మండలం పెద్దపల్లి పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.