- ఇద్దరి రోగుల పరిస్థితి విషమం
నాగర్‌కర్నూల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్వాకం!
నాగర్‌కర్నూల్, జనవరి 9 (విజయక్రాంతి): ఒక రోగికి వేయాల్సిన మెడిసిన్ మరో రోగికి వేయడంతో ఇద్దరి రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట ప్రాంతానికి చెందిన బద్దుల చిట్టెమ్మ(50) పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు చికిత్స ప్రారంభించారు.
అదే ఆసుపత్రిలో కిడ్నీ సంబంధిత వ్యాధితో చిట్టెమ్మ అనే మమో మహిళ చికిత్స పొందుతున్నది. ఈ క్రమంలో పురుగుల మందు తాగిని బద్దుల చిట్టెమ్మకు ఇవ్వాల్సిన మెడిసిన్ మరో చిట్టెమ్మకు ఇవ్వడంతో ఇద్దరి పరిస్థితి విషమంగా మారినట్లు బాధితులు ఆరోపించారు.
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒకరికి ఇవ్వాల్సిన మెడిసిన్ మరొకరికి ఇవ్వడంతో ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘును వివరణ కోరగా.. సమస్య సద్దుమణిగిందని ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు.