calender_icon.png 23 October, 2024 | 7:08 AM

పెళ్లి కుదిరిందా!

03-10-2024 12:00:00 AM

ప్రస్తుతం కాలంలో పెళ్లి కుదిరిన తర్వాత కాబోయే భార్యాభర్తలిద్దరూ కాస్త సమయం కేటాయించుకొని ఇష్టాయిష్టాలు, అభిరుచులు పంచుకుంటున్నారు. ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్లాన్ చేసేసుకుంటున్నారు. ఈ సమయంలోనే పెళ్లి ఖర్చు గురించీ చర్చించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పెళ్లి సమయంలో విభేదాలు రావడంలో ఆర్థిక అంశాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.

కాబట్టి వీటి గురించి ముందుగానే మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. పెళ్లంటే మధ్యతరగతి కుటుంబాలకు భారమే. మీ ఇంటి పరిస్థితి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి పెళ్లి ఖర్చు విషయం గురించి అవతలి వారితో మాట్లాడండి. ఏఏ ఖర్చులు ఎవరు చూసుకుంటారన్న దానిపై స్పష్టత వస్తే ప్రణాళిక సులువు అవుతుంది. అలాగే పెట్టుపోతల సంగతి కూడా క్లియర్‌గా మాట్లాడుకోవాలి.

అప్పుడే తర్వాత అపార్థాలు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం చాలామంది ఫ్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ అంటూ చాలా ఖర్చు చేస్తున్నారు. మీకూ అలా చేసుకోవాలనే కోరిక ఉండొచ్చు. అయితే వాటిని బడ్జెట్‌లో పూర్తి చేసుకోండి. అలాగే ఏ ఫంక్షన్ ఎవరు చేయాలి.. ఎక్కడ చేయాలి అన్న విషయాలు ఇరు కుటుంబాలు కూర్చొని చర్చించుకోవాలి. దీనివల్ల కుటుంబాల మధ్య అనుబంధం పెరగడమే కాకుండా భవిష్యత్తులో గొడవలు, ఇబ్బందులు రాకుండా ఉంటాయి.