calender_icon.png 26 February, 2025 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో చట్టం అందరికీ సమానమేనా?

25-02-2025 12:00:00 AM

దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ 23’. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. ఝాన్సీ, పావోన్ రమేశ్, తాగుబోతు రమేశ్, ప్రణీత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. అర్థవంతమైన కథతో కూడిన సందేశాత్మక చిత్రమని కొనియాడారు. ఈ క్రమంలోనే భట్టి సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా ఆవిష్కరించారు.

మంటల్లో చిక్కుకున్న బస్సుతో పాటు కొందరు వ్యక్తులను, ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తుతున్న ప్రజలతో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. జార్జ్ ఆర్వెల్ రాసిన ప్రసిద్ధ కోట్ “అంతా సమానం.. కానీ కొందరు మిగిలిన వారి కంటే మరింత ఎక్కువ సమానం” అనే ట్యాగ్‌లైన్‌ను పోస్టర్‌కు జత చేశారు.- ‘మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?’ అనే కోట్ ఆలోచింపకజేస్తోంది. సామాజిక స్పృహతోపాటు ఒక మెసేజ్‌ను అందించే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.