calender_icon.png 22 January, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్ ట్రా‘ఫికర్’ తప్పేనా?

26-08-2024 03:15:57 AM

  1. నగర వాసులను కలవరపెడుతున్న ట్రాఫిక్ 
  2. మూడు చోట్ల మాత్రమే పనిచేస్తున్న సిగ్నల్స్ 
  3. పద్మవ్యూహంలా టవర్ సర్కిల్  ఏరియా

కరీంనగర్ సిటీ, ఆగస్టు 25: రోజు రోజుకు విస్తరిస్తున్న నగరం.. అంతే స్థాయిలో పెరుగుతున్న వాహనాల వినియోగానికి తగ్గట్టు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు మాత్రం కానరావడం లేదు. శివారు ప్రాంతాలతోపాటు నగరం నడిబొడ్డున కూడా జీవనం సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. బహుళ అంతస్తుల భవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు పెరిగిపోయాయి. దీంతో కరీంనగరం ట్రాఫిక్ పద్యవ్యూహాన్ని తలపిస్తోంది.

నగరంలో రోజుకో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు పలువురిని బలి తీసుకునా.్న యి. నగరంలో కేవలం మూడు చోట్ల మాత్ర మే ట్రాఫిక్స్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. మిగ తా ప్రాంతాల్లో సిగ్నల్స్ ఉత్సవ విగ్రహాలను మరిపిస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ నియంత్రణలోకి రాకపోవడంతో తరచూ వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోవడం, ప్రమాదాలు జరగడం నిత్యకృత్యంగా మారింది.   

షాపింగ్ మాల్స్ వద్ద నరకం

కరీంనగరంలో షాపింగ్ మాల్స్ సంస్కృ తి పెరిగిపోతున్నది. డాక్టర్ స్ట్రీట్ రోడ్డులో రెండు షాపింగ్‌మాల్స్ ఏర్పాటు చేశారు. అ యితే, వీటికి సంబంధించి పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలుపుతున్నారు. దీంతో రద్దీ సమ యాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్ర హం వెనుక నుంచి డాక్టర్స్ స్ట్రీట్‌కు వెళ్లేందు కు ఉన్న చిన్న దారిలోనూ వస్త్ర దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు ఏర్పడ్డాయి. షాపింగ్‌కు వచ్చేవారితోపాటు నగరవాసులు ఈ మార్గంలో తరచూ రాకపోకలు సాగిస్తుంటా రు. చిన్నగా ఉన్న ఈ మార్గంలో కూడా అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇ వ్వడం విస్మయం కలిగిస్తోంది.

పద్మవ్యూహంలో టవర్ సర్కిల్

కరీంనగర్ వాణిజ్య ప్రాంతమైన టవర్‌సర్కిల్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు వ్యాపారులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా యి. అసలే ఇరుకు రోడ్లు, ఆపై రోడ్లపైనే వా హనాల నిలపడంతో గందరగోళంగా మారుతుంది. స్మార్ట్ సిటీ పనుల కోసం తరచూ రో డ్లను మూసివేయడంతో ప్రజ లు ఇక్కట్లపాలవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మెయిన్ మార్కెట్, ప్రకా శంగంజ్ ప్రాంతానికివచ్చే వాహనదారులకు పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో ఇబ్బ ందులు తప్పడం లేదు. సమీపంలోని ప్రభు త్వ స్థలాలను పార్కింగ్ స్థలాలకు కేటాయించేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

మానిటరింగ్ చేస్తున్నాం 

నగరంలో ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తు న్నాం. ట్రాఫిక్ సమ స్య జటిలంగా ఉంద ని గుర్తించిన రహదారుల్లో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, వాహనదా రులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నా ం. అలాగే సర్కిళ్ల వద్ద ఉన్న సిగ్నల్స్ స్మా ర్ట్ సిటీ పనుల్లో భాగమే. వాటిని పోలీసు శాఖకు అప్పగించలేదు. అప్పగిస్తే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. 

 కరీం, ట్రాఫిక్ సీఐ, కరీంనగర్