calender_icon.png 30 October, 2024 | 10:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద ముప్పు తప్పేనా..?

21-07-2024 01:30:51 AM

  1. చిన్నపాటి వర్షాలకే వరంగల్‌కు వరద ముప్పు 
  2. 2020 నాటి వరదలు మళ్లీ వస్తే నగరం తట్టుకుంటుందా? 
  3. నత్తనడకన నయీంనగర్ నాలా పనులు 
  4. ప్రశ్నార్థకంగా నోచని బొంది వాగు మరమ్మతులు 
  5. నాలుగేళ్లుగా ఇదే దుస్థితి... గ్రేటర్ వాసుల ఆందోళన 

హనుమకొండ, జూలై 20 (విజయక్రాంతి): చిన్నపాటి వర్షాలకే వరంగల్‌లోని వీధులు ముంపునకు గురవుతాయి. ప్రస్తు తం ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మున్ముందు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో 2020 నాటి వరదలు మళ్లీ వస్తే నగరవాసుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. వరద ముప్పు నివారణకు ప్రభుత్వం రూ.250 కోట్లు మంజూరు చేసింది. నిధులతో ఇప్పటికీ నయీంనగర్ నాలా కొనసా గుతూనే ఉన్నాయి. వరంగల్‌లోని బొంది వాగు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి.

కొనసాగుతున్న నాలా పనులు..

వర్షాలు కురిసినప్పుడు నయీంనగర్, బొంది వాగు, భద్రకాళి నాలాల ద్వారా నగరంలోని వరద సాఫీగా బయటకు వెళ్లిపోతుంది. భద్రకాళి నాలా పనులు రెండేళ్ల కింద ప్రారంభమవగా, ఆ తర్వాత బడ్జెట్ సమస్యల కారణంగా నిలిచిపోయాయి. మరోవైపు రూ.90 కోట్లతో ఫిబ్ర వరిలో నయీంనగర్ నాలా అభివృద్ధి పను లు  ప్రారంభమయ్యాయి. జూన్ 15 లోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నప్పటికీ అది సాకారం కాలేదు. ప్రస్తుతం పనులు నెమ్మదించాయి.

బొందివాగు నాలా అభివృద్ధికి కొన్ని నెలల క్రితం అధికారులు రూ.158 కోట్లతో ప్రతిపాదనలు పంప గా, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో  పనులకు బ్రేక్ పడింది. మంత్రి కొండా సురేఖ ఇటీవల వరద నివారణ పనులపై సమీక్షించి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ టెండర్ అగ్రిమెంట్లు జరగకపోవడంతో ఆ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. 

నాడు వరద బీభత్సం..

2020 ఆగస్టులో కురిసిన వర్షాలకు వరంగల్ నగరం నీటమునిగింది. ట్రై సిటీల పరిధిలోని మొత్తం 1,800 కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాలా లు, డ్రైనేజీలు, రోడ్లు దెబ్బతిన్నాయి. మరోసారి వరద ముప్పు రాకూడదంటే ఆక్రమణలు తొలగించాలని, నాలాలను విస్తరించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత అధికారులు 415 ఆక్రమణలను గుర్తించారు. వాటి తొలగింపు, నాలాల విస్తరణ, వరద నివారణ పనులకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ వాటికి ఆమోదం లభించలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది.