వ్యవసాయం అనేది పంట, పశువుల ఉత్పత్తి, ఆక్వాకల్చర్ , చేపల పెంపకం , ఆహారం ,ఆహారేతర ఉత్పత్తుల కోసం అటవీ సంపదను కలిగి ఉంటుంది. మానవులు కనీసం 1,05,000 సంవత్సరాల క్రితం ధాన్యాలను సేకరించడం ప్రారంభించగా, కొత్త రైతులు వాటిని 11,500 సంవత్సరాల క్రితం మాత్రమే నాటడం ప్రారంభించారు. ప్రపంచంలోని కనీసం 11 ప్రాంతాలలో మొక్కలు స్వతంత్రంగా సాగు చేయబడ్డాయి.
20వ శతాబ్దంలో, భారీ-స్థాయి ఏకసంస్కృతులపై ఆధారపడిన పారిశ్రామిక వ్యవసాయం వ్యవసాయ ఉత్పత్తి లో ఆధిపత్యం చెలాయించింది. 2021 నాటికిచిన్న పొలాలు ప్రపంచంలోని ఆహారంలో మూడింట ఒక వంతుమాత్రమే ఉత్పత్తి చేశాయి. అయితే పెద్ద పొలాలు ప్రబలంగా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రతి ఆరు పొలాలలో ఐదు 2 హెక్టార్ల (4.9 ఎకరాలు) కంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.
పొలాలు,వ్యవసాయం గ్రామీణ ఆర్థిక శాస్త్రాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. పురుగుమందులు, ఎరువులు వంటి వ్యవసాయ రసాయనాలు, సాంకేతిక పరిణామాలు పం ట దిగుబడిని గణనీయంగా పెంచాయి. కానీ, పర్యావరణ నష్టానికి కూడా దోహదపడ్డాయి. ఆరోగ్యం, వ్యవసాయం, పోషక విలువలకు సంబంధించి దేశంలో అనేక పరిశోధనా సంస్థలు చేసినహెచ్చరికలు, సూచనలను ప్రభుత్వం ముందుండి రైతు సంఘాలతో సమీక్షించి ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించడం తక్షణ కర్తవ్యం.
కానీ ఆ వైపుగా దృష్టి సారించినట్లుగా కనిపించడం లేదు. దాని కారణం గా పోషక విలువలు లేని ఆహారంతో ప్రజలు నష్టపోతున్నారు. మరోవైపు లాభసాటిలేని వ్యవసాయం తో ప్రభుత్వ సహకారం లేకుండా రైతులు గిట్టుబాటు ధర, ప్రతిఫలం లేకుండా పోరాటాల బాట పడుతుంటే ప్రభుత్వాలు మిన్నకుండడం ఎవరి ప్రయోజనం కోసం? ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ప్రాచీన నానుడి.
వైజ్ఞానిక పర్యావరణ కేంద్రం అధ్యయనంలోని గణాంకాలను పరిశీలిస్తే భారతదేశం లో 71 శాతం మందికి సమతుల ఆహారం దొరకడం లేదని, కనీసం రెండు పూటలా తిండికి నోచని పరిస్థితుల కారణంగా అనారోగ్యంతో ఏటా 17 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. మరో అధ్యయ నం ప్రకారం వయసుతో సంబంధం లేకుండా అలవాటు పడిన జంక్ ఫుడ్ ప్రమాదకర పరిస్థితుల కార ణంగా తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారు.
ఇక దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలు తారాస్థాయికి చేరినట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించడం మరింత ఆందోళనకర పరిణా మం. మన ప్రధాన ఆహార పంటలైన వరి, గోధుమలలో వ్యాధి నిరోధక పోషక పదార్థాలు, క్యాల్షియం, ఇనుము, జింకు వంటి అనేక ఖనిజ వనరులు క్రమంగా అడుగంటి పోవడంతో ఆహార పదార్థాలు కూడా మరింత ఊబకాయాన్ని, మధుమేహాన్ని పెంచడానికి కారణమవుతున్నట్టు తెలుస్తున్నది.
తెలంగాణలోనైతే కేవలం నీటి సరఫరా పేరుతో వరికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అనే క ఆహార పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి.
రోగ నిరోధకతను పెంచే పౌష్టికాహారం ప్రజలకు అవసరమని పరిశోధనలు ప్రభుత్వాలను హెచ్చరించినప్పటికీ ప్రస్తుతం 81 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇవ్వడం ద్వారా చేతులు దులుపుకుంటున్న విధానాన్ని గమనిస్తే ప్రజలకు పోషకాహారం ఎలా అందుతుంది? ప్రపంచంలో కొన్ని దేశాలు ప్రణాళికాబద్ధంగా పౌష్టికాహార పంపిణీ చేపడుతూ ప్రజల జీవన ప్రమాణాలను కాపాడుతుంటే భారతదేశంలో మాత్రం 30 శాతానికి పైగా పిల్లలు పోష కాహారం
లేక విష పదార్థాలను ఆరగించడం వలన అర్ధాంతరంగా జీవితాలు చాలించడం ఆందోళన కలిగించే విషయం కాదా ? ఎముకలు, నరాల పటుత్వం తో పాటు రోగనిరోధక శక్తిని అపారంగా పెంచగలిగే ఖనిజ వనరులు, విటమిన్లు, పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను పండించడానికి శాస్త్రవేత్తల తో కలిసి ప్రభుత్వాలు దృష్టిసారించాలి.
చిరు, సిరి ధాన్యాలను అధికంగా వినియోగించగలిగితే వ్యాధు ల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, పోషక విలువలు గల ఆహారాన్ని పొందడా నికి ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు పలు వేదికల మీద ప్రచారం చేసూ,్త ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నా ఆలకించిన వారు లేరు.
సామ లు, ఊదలు, కొర్రలు, అరికలు వంటి సిరి ధాన్యాల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల సామాన్యులు కొనలేకపోతున్నారు జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెల తోపాటు వీటిని కూడా పెద్దమొత్తంలో పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. ఆరోగ్య సిరులు కుర వాలంటే చిరుధాన్యాలు ప్రత్యేక మార్గమని ఇటీవల అనేక అధ్యయనాలతో పాటు ప్రధాన మంత్రి కూడా పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన దృష్ట్యా ఆ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజానికి ఎత్తుకున్నప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.
డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి