calender_icon.png 22 March, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అంతంతే?

22-03-2025 02:25:12 AM

22వ ప్యాకేజీకి ప్రత్యేక నిధుల కేటాయింపులు మరిచారు

కౌలాస్, పోచారం ప్రాజెక్టులకు కేవలం 10 కోట్లు

నల్ల వాగు కు ఐదు కోట్లు కేటాయింపు

కామారెడ్డి రైతాంగానికి అవసరమయ్యే ప్రాజెక్టుల మరమ్మతులకు మొండి చెయ్యి

కామారెడ్డి, మార్చ్ 21(విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కు వరప్రదా యనిగా  మారనున్న ప్రాణహిత చేవెళ్ల ప్రస్తుతం కాలేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు మళ్లీ మోక్షం లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో మొండి చేయి చూపింది. గతంలో 15 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలోని రైతన్న గారికి సాగునీరు అందించాలని ఉద్దేశంతో ప్రాణహిత చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాల్పూర్ నుంచి మంచిప్ప రిజర్వాయర్ అక్కడి నుంచి  భూ౦పల్లి రిజర్వాయర్ నో నిర్మించి అక్కడ నుంచి తాడువాయి మండల్ మీదుగా పెద్దాయిపల్లి వద్ద రిజర్వాయర్ అక్కడి నుంచి తల మడ్ల రిజర్వాయర్ ల నిర్మాణం చేపట్టి మెదక్ జిల్లా రామయంపేట్ మీదుగా సంగారెడ్డి నుంచి చేవెళ్ల వరకు సాగునీరు అందించాలని లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. 22వ ప్యాకేజీ పనులు కేవలం 160 కోట్లతో నిర్మాణం చేపడితే రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేశారు.

అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో చురుకుగా సాగిన పనులు బొంపల్లి రిజర్వాయర్ వరకు పనులు సాగి తాడువాయి నుంచి పెద్దయిపల్లి మీ వరకు కాలువల నిర్మాణం పనులు పూర్తి చేశారు. గతంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల వారంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాల రైతులకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక చేవెళ్ల ప్రాజెక్టు పేరును మార్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసింది. కానీ కామారెడ్డి జిల్లా లో ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాల్లో ఆగిపోయిన 22వ ప్యాకేజీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.

ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 22వ ప్యాకేజీ పనులు పూర్తి చేసి ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గ రైతులకు రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండవ ప్యాకేజీ పనులపై ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి సైతం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ 22వ ప్యాకేజీ పనులకు నిధులు కేటాయించాలని ఎన్నికల ముందు వాగ్దానం చేసాం కనుక పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క భారీ నీటిపారుదల శాఖ మంత్రి లకు సైతం విన్నవించారు. రాష్ట్ర బడ్జెట్లో కాలేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు ఏట్టి పరిస్థితిలో నిధులు కేటాయిస్తుందని స్థానిక ఎమ్మెల్యేలు సైతం భావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాలేశ్వరం 22వ ప్యాకేజీ పనులు నిధులు కేటాయించ కుండ మొండి చేయి చూపింది.

దీంతో రైతులు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టు బడ్జెట్లో నిధులు కేటాయించి పనులు పూర్తి చేసి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు సాగునీరు అందిస్తారని రైతు  భావించారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో నాడు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దొందు దొందు గానే వ్యవహరిస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు. కేవలం కామారెడ్డి జిల్లాలోని కౌలాస్ పోచారం ప్రాజెక్టులకు కేవలం 10 కోట్లు మాత్రమే ప్రకటించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద కాలువలు అధ్వానంగా ఉన్నాయి.

మరమ్మతులకు నిధులు కేటాయిస్తారని రైతాంగం భావించింది. ప్రభుత్వం మొండి చేయి చూపింది. దీంతో కామారెడ్డి జిల్లా రైతాంగం తీరా నిరాశ నిస్ప్రోహలతో ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు 22వ ప్యాకేజీ పనులపై నిధుల కోసం పోరాటం చేస్తే శాశ్వతంగా సాగునీరు రైతులకు అందుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వ్యవసాయ బోల్ ల కింద భూగర్భ జలాలు ఇంకిపోవడంతో వ్యవసాయ బోర్లు పట్టిపోతున్నాయి. దీంతో తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు. పెట్టిన పెట్టుబడును తో పాటు ఆరుగాలము కష్టపడిన కష్టం కూడా మిగలకుండా పొట్టదశలోనే వరికి తాగునీరు అందకుండా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రజా ప్రతినిధులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం 22వ ప్యాకేజీ పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. కేవలం వెండి ప్రాజెక్టుకు 42 కోట్లు కేటాయించి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో నామమాత్రంగా నిధులు కేటాయించారు. రైతులకు ఉపయోగపడాల్సిన ప్రాజెక్టు 22వ ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయించకపోవడం రైతులను నివ్వెర పోయేలా చేశారు.