- ములుగు కేంద్రంగా తాజాగా భూకంపం
- హైదరాబాద్‌లోనూ భూప్రకంపనలు
- సెస్మోలాజికల్ జోన్ 2లో నగరం
- ఇక్కడ భూకంపాల అవకాశం తక్కువేనంటున్న శాస్త్రవేత్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. హైదరాబాద్‌లోనూ కొన్నిచోట్ల భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ములుగు కేంద్రంగా 40 కి.మీ లోతులో భూకంపం రాగా, రిక్టార్ స్కేల్‌పై 5.3 పాయింట్లు నమోదయ్యాయి. భూకంప ప్రభావం 200 కి.మీకి పైగా ఉంది. దక్కన్ పీఠభూమిలో భాగమై స్మోలాజికల్ జోన్ ఉన్న హైదరాబాద్ నగరంలో భూకంపం వచ్చే అవకాశం లేదని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఒకప్పుడు ఎంసీహెచ్ గా ఉన్న నగరం ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ ఎంసీ)గా, దీని ఆవలి ప్రాంతం హెచ్‌ఎండీఏగా మారింది. తర్వాత ఓఆర్‌ఆర్ అందు బాటులోకి వచ్చింది. త్వరలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) వరకు నగర పరిధి పెరగనున్నది. ఈ నేపథ్యంలో కుప్పలు, తెప్పలుగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలుస్తున్నా యి.
భవనాల నిర్మాణంలో భాగంగా కార్మికులు పిల్లర్లు, సెల్లార్ల కోసం పది అడుగులకు పైగానే తవ్వాల్సిన పరిస్థితి. మూడు, నాలుగు అంతస్థుల నుంచి యాజమానులు 40 అంతస్థుల వరకు కట్టడాలు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ నగరానికి భూకంపం వస్తే పరిస్థితేంటనే ప్రశ్న నగరవాసుల్లో తలెత్తింది.
సెస్మోలాజికల్ జోన్
దేశంలో తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతాలు నాలుగు భాగాలుగా ఉన్నాయి. వీటిలో తెలంగాణ భూకంపాల ప్రభావం లేని జోన్ ఉందని నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ కేంద్రం (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ములుగు సమీపంలోని గోదావరి రిఫ్ట్ (రిస్క్) ప్రాంతంగా భావించే జోన్ భాగంలో బుధవారం భూకంపం సంభవించినట్లు ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాశ్‌కుమార్ వెల్లడించారు. సా ధారణంగా భూకంపాలు సంభవిస్తే ఆ సమీపంలోని 40 కి.మీ పరిధిలో మాత్రమే భూకంపం వస్తుందని, తద్వారా తర్వాతి 250 కిమీ వరకు ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఆ ప్రకంపనలను భూకంపంగా పరిగణించకూడదన్నారు.
యాక్సిలిరేషన్ వాల్యూతో ప్లానింగ్ బెస్ట్
భూకంప వేవ్స్ (తరంగాలు) 250 కి.మీ నుంచి 300 కి.మీ వరకు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చినట్లు కనిపించింది. ములుగులో 5.3 నమోదైతేనే ప్రకంపనలైతే, హైదరాబాద్ దక్కన్ పీఠభూమి అయినప్పటికీ, నగరానికి 200 కి.మీ పరిసరాల్లో రిక్టార్ స్కేల్‌పై 6 ప్లాయింట్ల కంటే ఎక్కువగా నమోదు అయితే, భూ ప్రకంపనలు మరింత అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
నిర్మా ణాల సమయంలో జోన్ ఫ్యాక్టర్‌కు సంబంధించి యాక్సిలిరేషన్ వాల్యూస్‌తో ఇంటి నిర్మాణ ప్లానింగ్ ఇవ్వాలని ఇంజినీర్లను కోరాలని ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త ఎం.శేఖర్ సూచిస్తున్నారు. లేక్ ఫీల్డ్, మట్టి, సాఫ్ట్ సాయిల్ ప్రాంతాల్లో నిర్మాణాలు కడితే భూకంపాల ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.