- హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలపై ఉన్న శ్రద్ధ ఓల్డ్‌సిటీపై లేదు
- ఓల్డ్‌సిటీ కాదు ఒరిజినల్ సిటీ అనే సీఎం మాటలు ఉత్తివేనా?
- నగరాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి
- కేంద్ర మంత్రి జీ.కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరం లోని హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ధను గత, ప్రస్తుత పాలకులు.. పాతబస్తీ అభివృద్ధ్దిపై చూపిండంలేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. నాంపల్లి నియోజకవర్గం గుడిమల్కాపూర్‌లో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూ నిటీ హాల్, అంబర్‌పేట నియోజకవర్గంలోని గోల్నాకలో గంగపుత్రుల కమ్యూనిటీహాల్‌తో పాటు ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్‌లో తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌నగరం.. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ఆదాయంలో మెజార్టీ ఆదాయం నగరం నుంచే వస్తున్నప్పిటికీ నిధుల కేటాయింపుల్లో సరైన న్యాయం జరగడం లేదన్నా రు. ఓల్డ్‌సిటీ కాదు ఒరిజినల్ సిటీ అని పదేపదే అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి స్పష్టమైన కార్యచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు.
నగర అభి వృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీకి మెట్రోను తీసుకురావడంతో పాటు ఎంఎంటీఎస్ నూతన లైన్ అభివృద్ధికి సహకరించా లన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఇళ్లు, దుకాణ సముదాయాలపై ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేయాలని లుపునిచ్చారన్నారు. భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా తిరంగా ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.