14-04-2025 01:20:26 AM
కేంద్రం పైసల్ వద్దనే దమ్ముందా?
కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): రేషన్‌షాపుల ద్వారా పేదలకు ఇస్తున్న బియ్యాన్ని కేంద్రమే ఇసున్నదనికాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. పేదలకు ఇచ్చే బియ్యంలో కిలోకు రూ.10 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.37 ఖర్చు చేస్తోందని చెప్పారు.
ప్రధాని మోదీ ఇస్తున్న పైసలతో ఇంతకాలం మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం ఇస్తూ మొత్తం ఖర్చంతా తమదేనని కాంగ్రెస్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బీజేపీ గావ్ చలో కార్యక్రమం లో భాగంగా ఆదివారం కరీంనగర్ రూరల్ మండలంలోని జూబ్లినగర్‌లో పర్యటించారు.
స్థానికులతో సమావేశమై కేంద్ర పథకాల అమలు, గ్రామ సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చెపుతన్నదే నిజమైతే రేషన్ బియ్యం కోసం కేంద్రం ఇస్తున్న పైసలు తమకు అక్కర్లేదని, తామే కిలోకు రూ.50 ఖర్చు పెట్టి పేదలకు సన్నబియ్యం అందిస్తామని కేంద్రానికి లేఖ రాసే దమ్ముం దా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
రేషన్ షాపుల వద్ద ప్రధాని ఫొటో పెట్టాలని కోరడం, పేదలకు అందిస్తున్న బియ్యంలో కేంద్రం వాటా ఉందని చెప్పమనడం తప్పా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం పెద్ద ఎత్తున అభివృ ద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం ఇస్తున్నామన్నారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని, 4 కోట్ల పేదలకు ఇండ్ల ను నిర్మించి ఇచ్చామని చెప్పారు.
30 కోట్ల టాయిలెట్లు నిర్మించామని, 12 కోట్ల ఉజ్వల కనెక్షన్లు ఇచ్చామని అన్నారు. తెలంగాణలో మాత్రం ఇక్కడి పాలకులు 11 ఏళ్లుగా పేదల కు ఇండ్లను ఇవ్వకుం డా వాళ్లకు గూడు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కేంద్రం 2.4 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ఒక్క ఇల్లు కట్టలేదని, అవి పూర్తి చేస్తే మరో 5 లక్షల ఇండ్లను మంజూ రు చేయిస్తామని మొత్తుకున్నా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాదిన్నరగా ఒక్క ఇల్లు కూడా కట్టకుండా పేదలకు అన్యాయం చేస్తోందన్నారు.
ఆరోగ్యశ్రీ కార్డుతో తెలంగాణలోని ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా చికిత్స చేసుకోవ చ్చని, కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఆ చికిత్సలు కూడా చేయడానికి ప్రైవే ట్ ఆసుపత్రులు ముందుకు రావడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భార త్ కార్డులిచ్చిందని, ఈ కార్డు చూపిస్తే దేశం లో ఏ ఆసుపత్రిలోనైనా 5 లక్షల దాకా ఉచితంగా ట్రీట్ మెంట్ చేసుకోవచ్చుని, కానీ ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేయకుండా పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారన్నారు.
పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ కేసీఆర్ పాలనను మించిపోతోందని, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఇదేందని అడిగితే అప్పులైనయ్... ఎవరూ నమ్మడం లేదని బుకాయిస్తున్నడని అన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరుగుతోందని, శ్మశానవాటికలు, రైతు భరోసా కేంద్రాలు, వీధి దీపాలు సహా చివరకు మొక్కలు నాటేందుకు అయ్యే పైసలన్నీ కూడా మోదీ ప్రభుత్వమే ఇస్తోందని బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): ‘కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్తున్నదెంత? కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నదెంత? అనే అంశంపై చర్చకు సిద్ధమా ? కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రప్రభుత్వం నిరుపేదలకు సన్నబియ్యం ఇస్తున్నదనే వ్యాఖ్యలు అవివేకం. రాష్ట్రప్రభుత్వం అదనపు భారం మోసి మరీ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నది.
మీరు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం పంపిణీ చేయగలరా? మీకు దమ్ముంటే బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ప్రధాని మోదీకి లేఖ రాయగలరా?’ అంటూ కేంద్ర మండి సంజయ్‌పై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఫైర్ ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. సన్నబియ్యం పంపిణీ నిరుపేదలకు వరమని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదని గుర్తుచేశారు.
తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి వేల కోట్ల పన్నులు వెళ్తుంటే, కేంద్రం మాత్రం రాష్ట్రానికి పైసా అయినా విదిల్చడం లేదని నిప్పులు చెరిగారు. బండి సంజయ్‌కి దమ్ముంటే దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కుల గణన కూడా చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేయాలని సవాల్ విసిరారు.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోగా, రాష్ట్రప్రభుత్వం చేస్తున్న ప్రతిపనికీ అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. నిరాధారంగా రాష్ట్రప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే తెలిసిన బీజేపీ నేతలకు.. నిరుపేదల సంక్షేమం పట్టదని మండిపడ్డారు.