calender_icon.png 22 September, 2024 | 4:59 AM

సీబీఐ పంజరంలో చిలుకేనా?

14-09-2024 03:14:55 AM

  1. మరోసారి అదే పదంతో మండిపడ్డ సుప్రీంకోర్టు 
  2. అధికార పార్టీలు చెప్పిందే వేదంగా పనితీరు 
  3. వ్యతిరేకులను కంట్రోల్ చేసే సాధనమని ఆరోపణలు 

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐపై సుప్రీంకోర్టు మండిపడింది. దేశంలో ఉన్నత దర్యాప్తు సంస్థ హోదాలో ఉన్న సీబీఐ పంజరంలో చిలుకలా వ్యవహరిస్తోందని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యాఖ్యానించారు. ఈ అపవాదును తొలగించుకోవాలని సూచించారు. అయితే, సీబీఐ ఇలాంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2013లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడూ అప్పటి సీజేఐ జస్టిస్ లోధా ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని పేర్కొన్నారు. 

ఎప్పటినుంచో ఇదే తీరు

అధికారంలో ఉన్న పార్టీలు ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు దర్యాప్తు సంస్థలను వినియోగిస్తున్నాయని ఎప్పటినుంచో ఉన్నమా టే. ప్రభుత్వాలు లేదా కోర్టుల ఆదేశాల మేరకే సీబీఐ విచారణలను స్వీకరిస్తాయి. సీబీఐ పరిస్థితి, దానిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు పంజరంలో ఉన్న చిలుక ఆనందం కోసం కాకుండా కోపంతో పాడుతుంది అనే ఇటాలియన్ సామెత సరిగ్గా సరిపోతుంది. అయితే, దేశంలో కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దాడు లు చేస్తున్నా.. ఇది ఇప్పుడే మొదలైంది కాదు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 2013లో వెలుగులోకి వచ్చిన బొగ్గు స్కామ్ కేసులోనూ ప్రభుత్వ జోక్యాన్ని ప్రశ్ని స్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ కేసులో ప్రభుత్వ అధికారుల సూచనల మేరకే రిపోర్టులో మార్పులు జరిగినట్లు కోర్టు గుర్తించింది. దీనిపై సీబీఐ వివరణ ఇస్తూ అధికార పార్టీ నేతలు, అధికారుల ఒత్తిడితోనే ఇలా జరిగిందని, వారితో సీబీఐ అధికారులు రిపోర్ట్ నివేదికను పంచుకున్నట్లు బయటపడింది. 

మద్దతుదారుల కోసమూ..

బొగ్గు స్కాంలో సీబీఐ స్వతంత్రతను ప్రశ్నించిన సుప్రీం.. సంస్థ పంజరంలో చిలుకలా ఉంటూ తన మాస్టర్ చెప్పినట్లు చేసిందని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో జరిగింది. అప్పుడు సమాజ్ వాదీ పార్టీ కూడా ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్పీ అధినేత ములాయం, ఆయన కుమారుడు అఖిలేశ్‌యాదవ్‌పై విచారణ జరగగా వారిపై ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో అదే ఏడాది సెప్టెంబర్‌లో సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది.

ప్రభుత్వం నుంచి ప్రాంతీ య పార్టీలు చేజారకుండా, వాటిని బెదిరించేందుకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించి, ఆ తర్వాత డర్టీ ట్రిక్స్‌ను వాడుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్.. ఎవరూ అధికారంలో ఉన్నా మిత్రపక్షాలను కంట్రోల్ చేయడానికి, విపక్షాలను టార్గెట్ చేయడానికి దర్యాప్తు సంస్థలను అధికార పార్టీలు ఉపయోగిస్తాయయి. ఉదాహర ణకు 2013లో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి డీఎంకే పార్టీ మద్దతు ఉపసంహ రించుకుంది. వెంటనే డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్, మరో నేత టీఆర్ బాలు నివాసాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. ప్రభుత్వం నుంచి వైదొలగడంతో ప్రతీకార  దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.