11-03-2025 12:00:00 AM
ప్రభాస్‌కు ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ‘రాజాసాబ్’, ‘ఫౌజి’ చిత్రాల షూటింగ్‌ల్లో బిజీబిజీగా ఉన్నాడు. దీని తర్వాత ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి’ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇక తాజాగా ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మతోనూ ఒక చిత్రాన్ని కమిట్ అయ్యాడు. ఇప్పటికే లుక్ టెస్ట్ సైతం ప్రభాస్ కంప్లీట్ చేసుకున్నాడని టాక్. ఈ ప్రాజెక్టు నుంచి తాజాగా కొత్త అప్డేట్ వచ్చింది.
అదేంటంటే.. ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు ‘బక’ అనే టైటిల్ ఖాయమైందట. ఇది విన్న ప్రభాస్ ఫ్యాన్స్‌ను టైటిల్ చాలా క్రేజీగా ఉందని ఆనందపడుతున్నారు. టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా కూడా మహాభారతంలోని బకాసురుడు గుర్తుకు రావడం ఖాయం.
ప్రశాంత్ వర్మ బకాసురుడి కథనే ఎంచుకున్నారని టాక్. అయితే నేటి ట్రెండ్‌కు తగినట్టుగా మార్పులు అయితే చేశారట. బకాసురుడి పేరును కూడా కుదించి క్రేజీగా, సింపుల్‌గా ‘బక’ అని ఫిక్స్ చేశారని సమాచారం.అలాగే ఈ సినిమా పౌరాణిక, మైథలాజికల్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్‌పై ఆధారపడిన చిత్రమట. మరి చూడాలి ఈ వార్తల్లో నిజమెంత అనేది.
త్రివిక్రమ్‌తో ‘జటాయు’?
నిర్మాత్ల దిల్ రాజు గతంలో ‘జటాయు’ అనే ప్రాజెక్ట్‌ను రూపొందించాలని గతంలో అనుకున్నారట. అయితే దానికి కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో ఆ ఆలోచనకు బ్రేక్ వేశారట. ప్రస్తుతం ఈ సినిమాను ప్రభాస్‌తో రూపొందించనున్నారని టాక్.
ఈ క్రమంలోనే గతంలో రూపొందించిన స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్ గా మలచేందుకు కొత్త రచయితలను కూడా రంగంలోకి దించారట. ఈ సినిమా కోసం త్రివిక్రమ్‌ను దర్శకుడిగా అనుకుంటున్నారట. మొత్తానికి ప్రభాస్‌తో ‘జటాయు’ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.