calender_icon.png 6 November, 2024 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిష్ఠానం అనుమతి ఉందా?

05-07-2024 01:09:01 AM

సీఎంల భేటీకి అంగీకరించిందా?

ఢిల్లీలోనే రేవంత్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటే బెటర్

రాజ్యాంగేతర శక్తిగా దీపాదాస్ 

బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ 

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్రానికి సీఎం రేవంత్‌రెడ్డినా? లేక కాంగ్రెస్ అధిష్ఠానమా? అని బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షులు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్‌పడరాని పాట్లు పడుతున్నారని, పాలనాపరమైన నిర్ణయాలు అమలు చేయడం లో స్వేచ్ఛ లేదన్నది సత్యమన్నారు. 6న జరి గే ఇద్దరు సీఎంల భేటీకి అధిష్ఠానం అనుమతి ఉందా? లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి ఈ సమావేశాన్ని ఆపే ప్రయత్నం చేస్తారా? అని అనుమానం వ్యక్తంచేశారు.

గురువారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో విభజన చట్టంలోని హామీల పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రేవంత్ ఢిల్లీలో క్యాంప్ కార్యాల యం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన అధిష్ఠానం చేతిలో బంధీగా మారారన్నారు.  తెలుగు ముఖ్యమంత్రులను అవమానించడం కాంగ్రెస్‌కు కొత్తేం కాదని విరుచుకుపాడ్డారు.