calender_icon.png 17 November, 2024 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసలు సంగతి అదా?

17-11-2024 12:33:47 AM

జనవరి నుంచి తమ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన ఏడాది సమయం పూర్తయిన తర్వాత తమ బాస్ రంగంలోకి దిగుతారని అంటున్నారు. కేసీఆర్ బయటకు రాకపోవడానికి పైకి ఏడాది సమయమని కారణాలు చెప్తున్నా.. అసలు విషయం మరొకటి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మహారాష్ట్ర నుంచే తమ జాతీయ ఎన్నికల ప్రస్థానాన్ని మొదలు పెడుతానని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయట్లేదు.

అక్కడ బరిలో దిగేందుకు అభ్యర్థులు లేకపోవడం వల్లే బీఆర్‌ఎస్ పోటీ చేయలేదన్న ప్రచారం కూడా జరిగింది. ఈ ఎన్నికల సమయంలో కేసీఆర్ బయటకు వస్తే.. మహారాష్ట్రలో సంగతేంటి? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుందన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తతోనే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న చర్చా జోరుగా సాగుతోంది.