20-03-2025 01:00:56 AM
వనపర్తి, మార్చి 19 (విజయక్రాంతి) : అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రసంగమా ? రాజకీయ ప్రసంగమా ? అని అసెంబ్లీ సాక్షిగా అబద్దాల చిట్టా చదివారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన ద్వారా విమర్శించారు. దక్షతతో, బాధ్యతగాహామీలు ఇచ్చాం, నెరవేర్చడం మాకు కష్టం కాదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మీద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారన్నారు.
ఒక్క ఏడాది నోరు కట్టుకుంటే అన్ని హామీలు నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఆయన గుర్తు చేశారు. ఒక మధ్యంతర బడ్జెట్ తో కలిపి ఇప్పుడుకాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నదిమూడో బడ్జెట్ అని, అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారం వెరసి తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న పాలనన్నారు.
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి