13-04-2025 12:00:00 AM
వేసవిలో మండే ఎండల వల్ల తరచు దాహం వేస్తూనే ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసం తాగడానికి ఇష్టపడతారు చాలామంది. చెరుకు రసంలో విటమిన్లు ఎ, బి, సి, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
అయినప్పటికీ కొంతమందికి చెరుకు రసం ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. అవును చెరకులో ఉండే పోలికోసనాల్ అనే రసాయనం ద్వారా నిద్రలేమి, కడుపు నొప్పి, తలతిరుగుడు, తలనొప్పి, ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది.
ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చెరుకు రసం తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని హఠాత్తుగా పెంచేస్తాయి. ఎందుకంటే ఇందులో గ్లుసైమిక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చెరుకు రసాన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
లేకపోతే ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. అలాగే అతిగా లావుఉన్నవాళ్లు చెరుకు రసం తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలని వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు చెరుకు రసం తీసుకోకపోవడం మంచిది. లేకపోతే బరువు పెరుగుతారు.