బాలీవుడ్ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ ప్రేమలో శ్రీలీల పడిందని బాలీవుడ్ టాక్. రియల్ లైఫ్‌లో కాదులెండి... రీల్ లైఫ్‌లో. తాజాగా కార్తీక్ ఆర్యన్ తన నాలుగో సినిమాను వినూత్నంగా ప్రకటించాడు. “ఇప్పటికే మూడు సార్లు ప్రేమలో ఓడిపోయాను. ఇక ఇప్పుడు నాల్గోసారి మళ్లీ అలా జరగకూడదని కోరుకుంటున్నా” అంటూ తన నాలుగో చిత్రం ‘తు మేరీ మై తేరా.. మై తేరా తు మేరీ’ చిత్రాన్ని ప్రకటించాడు.
ఆయన నాలుగో సారి ప్రేమలో పడింది శ్రీలీలతోనేని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సమీర్ విద్వాన్స్ రూపొందిస్తున్న చిత్రంలో కార్తీక్, శ్రీలీలలు జంటగా నటిస్తున్నారట. ఇప్పటికే శ్రీలీలతో మాట్లాడేశారని.. ఆమె కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెలిపారని తెలుస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్‌లోకి ఎంట్రీకి రంగం సిద్ధం కానుంది. దీంతో ఆమె పాత్రను ప్రత్యేకంగా చిత్రబృందం రూపుదిద్దుతోంది. మరికొన్ని రోజుల్లో శ్రీలీల హీరోయిన్ అన్న విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారట.