calender_icon.png 26 December, 2024 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా ఇసుక అక్రమ రవాణా?

26-12-2024 01:39:58 AM

కరీంనగర్, డిసెంబరు 25 (విజయక్రాం తి) : కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు పరివాహక ప్రాంతాల నుంచి అక్రమ ఇసుక రవాణా దందా జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిని యోజకవర్గం, మానకొండూర్ నియోజవర్గా లలోని ఇసుక రీనుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. గతంలో ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.1,800 నుంచి రూ.2 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.2800 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నా రు.

మానకొండూర్ మండలం ఊటూరు, వెళ్లి, లింగాపూర్ల నుండి జోరుగా ఇసుక అర్ధరాత్రి వేళ జిల్లా సరిహద్దులు దాటుతున్న ది. గృహ అవసరాల కోసమని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ హైదరాబాద్ పంపిస్తు న్నారు. చొప్పదండి ప్రాంతానికి కరీం నగర్ మండలం చేగుర్తి నుం డి ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. ఇక్కడ ఒక్కో ట్రాక్ట ర్కు రూ.3,500 వసూలు చేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల, చేగుర్తి గ్రామాల నుంచి కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది.

మైనర్లే డ్రైవర్లు...

ఇసుక అక్రమ రవాణాను నిర్వహిస్తున్న వారు ట్రాక్టర్ డ్రైవర్లుగా ఎలాంటి లైసెన్సు లేని మైనర్లను ఉపయోగిస్తున్నారు. గతంలో ఇరుకుల్ల, చేగుర్తి ప్రాంతాలలో ప్రమాదాలు జరిగినా రవాణాశాఖ గాని, పోలీసులుగాని పట్టించుకోలేదు. మైనర్లు ట్రాక్టర్లు నడుపుతుండడంతో రాష్ డ్రైవింగ్ వల్ల అర్ధరాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.

మానకొండూర్‌లో వేరు వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటనలు కూడా జరిగాయి. పోలీసుశాఖ, రెవెన్యూశాఖ ఉక్కుపాదం మోపకుంటే ఇసుక అక్రమ రవాణాకు తెరపడే అవకాశాలు లేవు. కరీంన గర్ జిల్లానే కాకుండా సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్, రాగట్లపల్లి, తదితర ప్రాంతాల్లో మానేరు ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నవారు మైనర్లను డ్రైవర్లుగా వాడుకున్న సంఘటనలు వెలుగులోకి వచ్చినా చర్యలు తీసుకోలేదు.