26-03-2025 12:24:03 AM
నాగర్ కర్నూల్ మార్చి 25 (విజయక్రాంతి): నిరుపేదల ఇళ్ల నిర్మాణం కోసం అత్యంత తక్కువ ధరలో ఇసుకను అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మన ఇసుక వాహనాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఖద్దరు నేతలు అక్రమ మార్గాన ఇసుకను తరలించే దందాకు ముక్కుతాడు వేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కూడా సమకూర్చే నిర్ణయం తీసుకుంది.
కానీ కొందరు ఇసుక మాఫియా గ్యాంగ్ అధికారుల కళ్ళు కప్పి ట్రాక్టర్లకు ఎలాంటి పత్రాలు లేకపోయినా ఇసుక తరలింపు కోసం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుందడంతో పాటు ఇసుకను తరలించే కార్మికులు, ఇతర వాహనదారులను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ వంటి పత్రాలు లేకపోయినా మైనర్ డ్రైవర్ల చేత అతి వేగంతో వాహనాలు నడిపిస్తూ రోడ్డు రవాణా నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తున్నారు.
ట్రాక్టర్ ఇంజన్, బాడీతో సంబంధం లేకుండా ఇసుకను తరలించడంతో ప్రభుత్వ అనుమతులు పొంది నట్లుగానే అక్రమ ఇసుకను కూడా ఇలాంటి వాహనాల్లోనే తరలిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొందరు ట్రాక్టర్ యజమానులు మాత్రమే వాహనానికి సంబం ధించిన పత్రాలను పొందుపరిచాకే మైనింగ్ శాఖ అనుమతితో మన ఇసుక వాహనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ వారికి కూడా మైనింగ్ శాఖ అధికారులు ఎలాంటి స్టిక్కర్ గుర్తింపు పత్రా లు ఇవ్వకపోవడంతో అక్రమ ఇసుక తరలింపు సులువుగా జరుగుతోందని విమర్శ లు ఉన్నాయి.
సోమ, మంగళవారం రెండు రోజుల్లో ఆరు అనుమతులు, పత్రా లు లేని ఇసుక ట్రాక్టర్లను జిల్లా ఏఎస్పీ రామేశ్వర్ సీజ్ చేశారు. ఎలాంటి నెంబర్ ప్లేట్ వాహనానికి సంబంధించిన పత్రాలు లేకుండానే ప్రభుత్వ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ లను అదులోకి తీసుకుని ఫెనాల్టీ కోసం రవాణా శాఖ అధికారులకు రిఫర్ చేశారు. ప్రభు త్వ అనుమతి పొందిన ఇసుకను తరలించాల న్నా వాహనానికి సంబంధించి అన్ని పత్రాలు పొంది ఉండాలని ఇలాంటి అనుమతి లేని వాహనాలు రోడ్లపై తిరిగితే కఠి నంగా వ్యవహరిస్తామని ఏఎస్పి రామేశ్వర్ హెచ్చరించారు.
నడిగడ్డలో అన్ని నకిలీ ట్రాక్టర్లే...!
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండ లం నడిగడ్డ పరిసరాల్లోని దుందుభి వాగులో ప్రభుత్వం ఇసుక రీచ్ ను గుర్తించిం ది. నిబంధనల ప్రకారం సరైన పత్రాలు పొందిన ట్రాక్టర్లు ఇసుకను తరలించేందుకు వినియోగించాలి. కానీ సుమారు 100కు పైగా ట్రాక్టర్లు ఎలాంటి పత్రాలు లేకుండానే ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. ఆ ట్రాక్టర్ల పరిధిలోని ఆయా గ్రామాల మహిళా లేబర్ పనిచేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరిని బాద్యులను చేస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
సద రు ఇసుక మాఫియా గ్యాంగ్ కక్కుర్తితో ఇంటర్ కూడా పూర్తి చేయని మైనర్లకు ఇతర వ్యసనాలకు బానిసలుగా మార్చి ఇసుక తరలింపుకు పని చేయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇసుకలోడుతో అతివేగంతో ప్రయాణించే ఇసుక వాహనాలు ఎంతో మందిని బలి తీసుకున్న ఘటనలు లేకపోలేదు. అయినా ఆర్టీవో అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అక్ర మ ఇసుక తరలింపు అంశంలో విజయ క్రాంతి ప్రచురించిన వరుస కథనాలతో జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించింది. అర్ధరాత్రిల్లు టిప్పర్లు ట్రాక్టర్ల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. దీంతోపాటు నెంబర్ ప్లేట్ పత్రాలు లేని ట్రాక్టర్లను కూడా ఏ ఎస్పి రామేశ్వర్ సీజ్ చేశారు. నిఘా మరింత కట్టుదిట్టం చేసి అక్రమంగా ఇసుకను తరలిస్తే వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చర్యలు తీసుకుంటాం...
ఎలాంటి పత్రాలు లేకుండా వాహనాలు రోడ్లపై నడిపితే చట్టపరమైన చర్యలు చేపడతాం. ఇసుకను తరలించే ట్రాక్టర్లు నిబం ధనల ప్రకారం అన్ని అనుమతులు పొందాల్సిందే.
బాలు నాయక్, రవాణా శాఖ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా.