calender_icon.png 10 January, 2025 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యమైన విద్య సాధ్యమా?

17-10-2024 12:00:00 AM

తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ, ప్రయివేటు డీఈడీ (ఉపాధ్యాయ శిక్షణ) కళాశాలల్లో శిక్షణ లేకుండానే పరీక్షలు రాసి ఉత్తీర్ణులై ప్రాథమిక పాఠశా లలలో ఉపాధ్యాయులుగా నియామకం పొందుతున్నారు. విద్యార్థులకు ప్రాథ మిక విద్య పునాది లాంటిది. శిక్షణ పొందని ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆశించడం మన అమాయకత్వం అవుతుం ది.

హైద్రాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల విద్యా శాఖాధికారుల కార్యాలయాలలో ఔట్ సోర్సింగ్‌గా పని చేస్తునే డీఈడీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు పొంది ఎస్జీటీ ఉపాధ్యాయుల పోస్టులకు ఎంపికయ్యారు. దాదాపు 15 మందికి పైగా జిల్లా విద్యా శాఖాధికారుల కార్యాలయాలలో ఔట్ సోర్సింగ్‌గా సెలవు పెట్టకుండా డీఈడీ ఏ విధంగా చేశారని ఆరా తీస్తే డీఈడీ కళాశాలల మాయాజాలం బయటపడింది.

విద్యార్థులకు చదవడం రావాలి. చదివింది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నది రాయాలి అని లెర్నింగ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాం, సీసీఈ, కొత్త కొత్త పేర్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షలకు లక్షలు నిధులను మంజూరు చేస్తున్నాయి. పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టినట్లు ఉపా ధ్యా య శిక్షణ కళాశాలల్లో ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు లేకుండా శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్లు పొందిన ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌తో ఏ విధంగా నాణ్యమైన విద్యను ఆశించగలం. 

ఉపాధ్యాయ శిక్షణ కళాశాలల్లో ఫీజుతో పాటు మరి కొంత డబ్బు చెల్లిస్తే రికార్డు లు, అటెండెన్స్ , ప్రాక్టీస్ తరగతులు ఏమి చేయకుండా నేరుగా పరీక్షలు రాసి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్లు పొందుతున్నారు. రాష్ట్రం లోని డీఈఈ సెట్ ద్వారా డైట్ కళాశాలల్లో చదవడానికి ఈ ఏడాది ఆగస్టు 1 నుండి 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు.

తెలంగాణలోని 33 జిల్లాలలో పాత 10 జిల్లాలలో మాత్రమే డిస్ట్రిక్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ (డైట్) కళాశాలలు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయులుగా నియామకం కావడానికి ఇంటర్మీడియట్ తర్వాత డైట్ ఉత్తీర్ణులైన తర్వాత (టీచ ర్స్ ఎలిజిబిలిటి టెస్ట్) టెట్ ఉత్తీర్ణత సాధించి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉపా ధ్యాయులుగా ప్రాథమిక పాఠశాలలలో ఎంపిక చేస్తారు.

గతంలో డిగ్రీ చేసిన తర్వాత బీఎడ్ పూర్తి చేస్తే వారికి  ఎస్జీటీ ఉపాధ్యాయులుగా నియామకం కావ డానికి అవకాశం ఉండేది. అయితే కొంతమంది డైట్ పూర్తి చేసిన వారు ప్రాథ మిక పాఠశాలలలో బోధించడానికి బీఎడ్ వారు అర్హులు కారని హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకొని రావడం, వాద ప్రతివాదనల తర్వాత బీఎడ్ వారు అర్హులు కారని తీర్పు ఇవ్వడం జరిగింది.

బీఎడ్ చేసిన వారు సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్తే  ప్రాథమిక పాఠశాలలలో ఎస్జీటీ ఉపాధ్యాయులుగా డీఎడ్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులని తీర్పు వచ్చింది. దీంతో డీఎడ్‌కు డిమాండ్ బాగా పెరిగింది. కానీ గత రెండు దశాబ్దాలుగా డైట్ కళాశాలల్లో కేవలం 20 మంది మాత్రమే రెగ్యులర్ ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు పని చేస్తున్నారు. మిగతా వారు ఈఎల్టీసి నుండి డిప్యూటేషన్ మీద తీసుకొన్నారు.

ఏళ్ల తరబడిఇదే పద్ధతి కొనసాగుతోంది. ఒక విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడు తుందని, ప్రాథమిక పాఠశాల దశ జీవితంలో ఎంతో ముఖ్యమని చెప్తారు. ప్రాథమిక పాఠశాలలలో బోధించే ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోతే నాణ్యమైన విద్యను ఏ విధంగా బోధిస్తారనేది ఊహకు అందని ప్రశ్న. 

 డా. ఎస్. విజయ భాస్కర్