మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 13 (విజ యక్రాంతి): కొడం గల్ మాజీ ఎమ్మె ల్యే పట్నం నరేంద ర్‌రెడ్డిని అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిం చారు. పాలన గాలికి వదిలి అక్రమ కేసులతో రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా ప్రజాపాలనా అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులతో అణచివే యలేరని పేర్కొన్నారు. ప్రజల తరఫు న ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామ ని స్పష్టంచేశారు.