calender_icon.png 23 December, 2024 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రసాదాల్లో కల్తీ భావ్యమా?

22-09-2024 12:00:00 AM

ఇటీవల ఆహారంలో పాలు, నీళు,్ల మందులు అన్నీ కల్తీకి గురవుతున్నాయి. కానీ నేడు పవిత్ర లడ్డూ ప్రసాదం కూడా కల్తీ జరిగింది. ఇది కలికాల మహిమా లేక నాటి పాలకుల కక్కుర్తి తనమా? నిత్యం వేలాది భక్తులు దేశ విదేశాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుని లడ్డూలనుమహా ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. మరి అంతటి గొప్ప పేరున్న లడ్డూను కల్తీ చేయడం భావ్యమా? నాణ్యత లేని నెయ్యి తినడం వల్ల భక్తుల ఆరోగ్యం కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది ముమ్మాటికీ హిందువుల భక్తి భావాలపై, మనోభావాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వెనుక ఎవరు ఉన్నా వారిని ఉపేక్షించ కూడదు. టీటీడీ బోర్డు వారు స్వయంగా గోవులను, గోశాలలను ఏర్పాటు చేయాలి. వాటి నుండే స్వామివారి సేవలకు కావాల్సిన ఉత్పత్తులను తయారు చేసుకోవాలి.

శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్