calender_icon.png 18 March, 2025 | 6:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కునుకు మంచిదే కానీ?

02-03-2025 12:00:00 AM

మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిదంటారు నిపుణులు. అయితే కునుకు తీయడం మంచిదని ఎక్కువసేపు నిద్రపోకుండా జాగ్రత్త పడటం కూడా ముఖ్యమంటున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్రపోకపోతే.. మధ్యాహ్నం గంటలు గంటలు నిద్ర పోతారు.

కానీ దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు దరిచేరే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం తిన్న తర్వాత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల బద్దకం, చిరాకు, అలసట వంటి అనేక సమస్యలు వస్తాయి. అంతే కాకుండా ప్రతిరోజూ మధ్యాహ్నం కునుకు సమయంలో 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 30 నిమిషాల కంటే తక్కువ లేదా 30 నిమిషాలు నిద్రపోయేవారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం చాలా తక్కువ. అందుకే మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోకుండా.. 30 నిమిషాలు మాత్రమే కునుకు తీయాలని నిపుణులు సూచిస్తున్నారు.