మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య బంధం చెడిందా.. ఐకా న్ స్టార్ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని పూర్తి గా దూరం పెట్టేశాడా? అంటే ఔననే స మాధానం వినిపిస్తోంది. ఇ టీవల అల్లు అర్జున్ వ్య వహర శైలినే అందుకు ప్రధాన కారణం. ఈ మధ్యనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనం గా జరిగాయి. పలువురు టాలీవుడ్ ప్రము ఖులు సోషల్ మీడి యా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయి తే అల్లు అర్జున్ కూడా గ్రీటింగ్స్ తెలిపారు. “హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు” అంటూ అల్లు అర్జున్ ట్వీ ట్ చేశారు.
అయితే అల్లు అర్జున్‌కు పవన్ కళ్యా ణ్ చిన మామయ్య అవుతారు. గతంలో ఎన్నోసార్లు మామయ్య అంటూ ప్రేమను చాటుకు న్నారు. కానీ మొదటిసారి ‘పవన్ కల్యాణ్ గారు’ అని సంభోదించడంతో చర్చనీయాంశంగా మారింది. అల్లు అర్జున్ ట్వీట్ తో మెగా, అల్లు కుటుంబం మధ్య దూరం పెరిగింది? అనే గుసగసుసలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇక ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయకపోవడంపై అల్లు అర్జున్‌పై మెగా అభిమా నులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.