- నిర్మల్ జిల్లాలో మాఫీకాని రైతులు 6 వేల మంది
- రూ.2 లక్షలకు పైగా ఉన్నవారు 25వేల మంది
- ప్రభుత్వ తీరుపై అన్నదాతల అసహనం
నిర్మల్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో చాలా మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. నాలుగు విడతల్లో నిర్మల్ జిల్లాలోని సుమారు 70,234 మంది రైతులకు రూ.642 కోట్లు విడుదల చేసింది.
ఈ పక్రియను ఆగస్టులోపు పూర్తి చేయగా.. జిల్లాలోని 79 వ్యవసాయ కస్టర్లలో ఏఈవోలు, ఏవోలు అర్హత ఉండి సాంకేతిక కారణాల కారణంగా రుణమాఫీ కానీ రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా 13,632 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి పంపగా ఇందులో 6,342 మంది రైతలకు రూ.69 కోట్లు విడుదల చేశారు.
రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న వారిలో ఇంకా సగం మంది రైతులకు మాఫీ కాలేదు. దీంతో రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో చాలా మంది రూ.50 వేల నుంచి రూ.2 లక్షల లోపు ఉన్న చిన్న, సన్న కారు రైతులే ఉన్నారు.
రూ.2 లక్షలు దాటిన రుణాల సంగతేంటి?
రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు రేషన్‌కార్డు ప్రామాణికంగా రూ.2 లక్షలకు పైన ఉన్న డబ్బులు రైతులు బ్యాంకులకు చెల్లిస్తే ప్రభుత్వం రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తుందని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించారు. ఇప్పటి వరకు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చెయ్యకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారకు.
నిర్మల్ జిల్లాలో రూ.రెండు లక్షలకు పై గా రుణం ఉన్న రైతులు సమారు 25 వేల మంది ఉంటారని వ్యవసాయ అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం రణమాఫీ చేస్తుందని చాలామంది రైతులు బ్యాంకులో తీసు కున్న పంట రుణాలు చెల్లించకపోవడంతో డీఫాల్టర్‌గా మారి, రుణంపై వడ్డీ పెరుగుతుంది. భవిష్యత్తులో పంటల బీమా పథ కంతో పాటు ఇతర సంక్షేమాలకు అర్హత కో ల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆందోళనలు
ఇప్పటికే అసెంభ్లీలో రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రుణమాపీపై బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతులకు బహిరంగ లేఖలు రాయడంతో రైతులు కూడా ఉద్య మం చేసేందుకు కార్యాచరణతో ముందుకుపోతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా రైతు లు ఆందోళనలు నిర్వహిస్తునానరు.
మా గ్రామంలో 200 మందికి మాఫీ కాలేదు
మాది నిర్మల్ మండలం అనంతపేట్ గ్రామం. నాకు బ్యాంకులో ఉన్న రూ.1.60 లక్షల రుణం మాఫీ కాలేదు. మా గ్రామంలో రూ.2 లక్షల లోపు రుణం ఉన్న రైతులు 200 మందికి మాఫీ కాలేదు. రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్నవారు 300 మంది ఉన్నారు. వీరంతా రుణమాఫీ కోసం అధికారులకు మొర పెట్టుకున్నా వారు తమ చేతిలో ఏమీ లేదంటున్నారు. బ్యాంకు అధికారులు అప్పులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. వడ్డీ పెరుగుతుండటంతో మాకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే అర్హులైన రైతులకు రుణమాఫీ చేయాలి.
లింబాద్రి, అనంతపేట్, నిర్మల్ మండలం
రెండు ప్రభుత్వాల్లో మాఫీ కాలేదు
మాకు ఉన్నదే కొద్దిపాటి భూమిపై బ్యాంకులో రూ.55 వేల రుణం తీసుకున్నాం. వడ్డీతో కలిపి రూ.60 వేలు అయ్యింది. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రూ.లక్ష మాఫీలో మా రుణం మాఫీ కాలేదు. బ్యాంకు అధికారులను వ్యవసాయ అధికారులను అడిగితే ఖాతాలో తప్పు ఉన్నదన్నారు. దాన్ని సరిచేసినా అప్పుడు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా రుణమాఫీ వస్తుందని అనుకున్నాం. ఇప్పుడు కూడా మాఫీ కాలేదు.
ఎనుగందుల సుఖన్య, బాబాపూర్