calender_icon.png 29 November, 2024 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిలావర్‌పూర్‌లో చర్చకు కేటీఆర్ సిద్ధమా?

29-11-2024 02:21:20 AM

బీఆర్‌ఎస్ హయంలోనే ఇథనాల్ కంపెనీ: మంత్రి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 28(విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు గత బీఆర్‌ఎస్ ప్ర భుత్వమే 2022లోనే అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. గత బీఆర్‌ఎస్ విధానాలకు వ్యతిరే కంగా నాడు తాము ప్రతిపక్షంలో ఉండి ధ ర్నాలు చేశామని గుర్తుచేశారు. గాంధీభవన్ లో గురువారం మీడియాతో సీతక్క మాట్లాడారు.

నాడు ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేటీ ఆర్.. ఆ గ్రామంలో గ్రామసభ పెట్టకుండానే ఇథనాల్ కంపెనీకి అనుమతి ఇచ్చారని విరుచుకుపడ్డారు. గ్రామసభ నిర్వహించకుండానే కేటీఆర్ సంతకంతో పర్మిషన్ ఇచ్చారని, త్వరలోనే వాటిని బయటపెడుతామని స్పష్టం చేశారు. ఇప్పుడు నిస్సిగ్గుగా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చే స్తున్నారని మండిపడ్డారు.

ఇథనాల్ కంపెనీపై అసెంబ్లీలో స్పీక ర్ ముందు పెట్టి చర్చిస్తామని మంత్రి చెప్పా రు. ఇథనాల్ కంపెనీ డైరెక్టర్లుగా తలసాని శ్రీనివాస్‌యాదవ్ కొడుకు సాయికిరణ్ యాదవ్, తలసాని వియ్యంకుడు పుట్టా సు ధాకర్ కొడుకు ఉన్నారని వెల్లడించారు.

కేటీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే దిలావర్‌పూర్ రావా లని, తాను కూడా అక్కడికి వస్తానని.. కంపెనీకి పర్మిషన్ ఎవరిచ్చారో తేలుద్దామని సవా ల్ విసిరారు. ఇప్పటికైనా కేటీఆర్ తప్పును ఒప్పుకోవాలని హితవు పలికారు. తమ ప్ర భుత్వం కంపెనీలు ఎక్కడా పెట్టినా గ్రామ స భలు నిర్వహిస్తున్నదని పునరుద్ఘాటించారు.