మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి సవాల్
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సిద్ధమా? అంటూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఇప్పటివరకు ౪ దేశాలు తిరిగొచ్చిన టూరిజం శాఖ మంత్రిగా ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో అభిలాశ్ రంగినేనితో కలిసి మాట్లాడుతూ రాష్ట్రమంత్రులకు కేటీఆర్, హరీశ్‌రావులను విమర్శించకపోతే పూట గడవ డం లేదని, జూపల్లి తమ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డిపై అడ్డగోలు విమర్శలు చేశారన్నారు.