calender_icon.png 20 November, 2024 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులను పరామర్శిచడం తప్పా?

20-11-2024 03:40:01 AM

పోలీసుల తీరుపై పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఫైర్

వికారాబాద్, నవంబర్ 19(విజయక్రాంతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో అధికారం కోల్పోయిం దని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటే ప్రజాగ్రహం చవిచూడక తప్పదని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య అన్నారు. మంగళవారం దుద్యాల మండలంలోని రోటిబండ తండా, లగచర్ల గ్రామాల్లోని మహిళలను కలిసేందుకు మహిళా సంఘాల బృందంతో వెళ్తున్న ఆమెను తుంకిమెట్ల కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును సంధ్య తప్పుబట్టారు. ఫార్మా భూ బాధిత గ్రామాల్లో పరిస్థితులు బాగాలేవని, ఆయా గ్రామాల మహిళలు మాకు సమాచారం ఇవ్వడంతోనే అక్కడికి పోతున్నట్లు తెలిపారు. బాధితులను పరామర్శిద్దామని వెళ్తుంటే అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల నాయకులు.. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీ నర్ జ్యోతి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, నాయకురాళ్లు.. ఝూన్సీ, గీత, పద్మజ షా, సిస్టర్ లీజీ తదితరులు ఆమెవెంట ఉన్నారు.