calender_icon.png 23 February, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెప్మాలో రూ.3 కోట్లు స్వాహా?

20-02-2025 12:09:58 AM

  1. అడ్డదారుల్లో రుణం పొంది ఉడాయించిన ఆర్‌పీ
  2. డ్వాక్రా సంఘాలకు నోటీసులు 

ఖమ్మం, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఖమ్మం నగరపాలక సంస్థలోని మెప్మాలో అవినీతి దందా వెలుగు చూసింది. దాదాపు రూ.3 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. మహిళా స్వయంసహాయ సంఘాల రుణాల జారీ విషయంలో వారికి తెలియకుండా వారికి సంబంధించిన సొమ్మును ఆర్‌పీలుగా పని చేస్తున్న వారు కాజేశారనే ఆరోపణలున్నాయి.

రుణాలు తీసుకోకపోయినా వారి పేరుతో నోటీసులు వస్తుం   మహిళా స్వయం సహాయక సం ములు ఆందోళన చెందుతూ అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తున్నది. మెప్మాలోని ఓ ఆర్‌ఫీ దాదాపు రూ.3 కోట్ల రుణా  స్వయం సహాయక సంఘాల పేరుతో తీ  ఉడాయించారనే ఆరోపణలు ఉన్నాయి.

ఖమ్మంలోని రోటరీనగర్ ప్రాంతానికి చెందిన బ్యాంక్‌తో పాటు పాత బస్టాండ్ వద్ద ఉన్న మరో బ్యాంక్‌లో సదరు ఆర్‌పీ రుణాలు పొందినట్టు తెలుస్తున్నది. మెప్మాలో  ఇద్దరి అధికారుల సంతకాలతో ఆమె ఈ రుణం పొందినట్లు తెలుస్తోంది. సదరు ఆర్  కనిపించకుండా పోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు, బ్యాంక్ అధికారులు హైరానా పడుతున్నారు. స్త్రీనిధి రుణాల్లోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా ఉన్నతాధికారులు కను  జరిగిందని తెలుస్తున్నది. 

కల్లూరులో నిధులు పక్కదారి! 

కల్లూరు మండలంలో దాదాపు వెయ్యి డ్వాక్రా సంఘాలున్నాయి. పెద్ద ఎత్తున స్త్రీని  కింద రుణాలు పొందారు. వీటికి సంబంధించి రూ.కోట్లల్లో అవినీతి జరిగిందనే ఆరో  వస్తున్నాయి. తీసుకున్న రుణాలు రికవరీ కూడా చేయకపోవడంతో కోట్లల్లో బకాయిలు పేరుకుపోయినట్లు సమాచారం.