calender_icon.png 23 September, 2024 | 12:05 AM

మరీ ఇంత పాపమా?

06-09-2024 01:25:12 AM

  1. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములకు రక్షణేది? 
  2. 4 ఏళ్ల క్రితం ఫైల్ దొరకట్లేదు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ భూములను పరిరక్షించే ందుకు ఉన్న రెవెన్యూ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తుందా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వ చెరువులు, నాలాలు, బఫర్‌జోన్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించి భవంతులు, రియల్ వ్యాపారాలు చేస్తుంటే వాటిని పరిరక్షించడంలో  రెవెన్యూశాఖ పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. 4 క్రితం అప్పటి కలెక్టర్ శైనీ ఆదేశాల మేరకు పాల్వంచలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని రక్షించి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించిన ఫైల్ ప్రస్తుతం కన్పించడం లేదు.

2019 సంవత్సరంలో ఆనాటి పాల్వంచ ఇన్‌చార్జి తహసీల్దార్ సర్వే నంబర్లు 444, 999, 817లో ఆక్రమించుకొన్న ప్రభుత్వ భూములను గుర్తించి 40 నుంచి 50 ఎకరాలు పరిరక్షించారు. శైనీ బదిలీ తర్వాత వచ్చిన తహసీల్దార్లు వాటిని కాపాడటంలో పూర్తిగా విఫలమై ఆక్రమణదారుల పరం చేశారని, ఈ మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఆరోపణలున్నాయి. ఆనాడు భూములకు ఫెన్సింగ్ వేయగా సగానికిపైగా కనిపించడం లేదంటే రెవెన్యూ వ్యవస్థ పనితీరు ఎలా ఉందో తేటతెల్లమవుతోంది. ఆక్రమించిన భూములు స్వాధీనం చేసుకోకపోయినా కనీసం స్వాధీనం చేసినవాటినైనా కాపాడకపోవడం శోచనీయం.