28-02-2025 12:42:54 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన ప్ర మాదాల్లో అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఘటన స్థలాలకు వెళ్లని విషయాలను విస్మరించి.. మీరు మంత్రిగా చేసిన పా పాలకు నేడు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులపై నిందలు వేస్తారా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుపై సీఎం చీఫ్ పీఆర్వో బో రెడ్డి అయోధ్యరెడ్డి మండిపడ్డారు.
హరీశ్‌రా వు మంత్రిగా ఉన్నప్పుడు సొరంగం పనులు ఆపడమే ఎస్‌ఎల్బీసీ ప్రమాదానికి కారణమని, ఇందుకు మీ అంతరాత్మ ఘోషించ డం లేదా అని గురువారం ఎక్స్ వేదికగా ప్ర శ్నించారు. కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతే అప్పటి సీఎం కేసీఆర్ ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ప్రశ్నించారు. టన్నెల్‌లో కూరుకుపోయిన కార్మికుల ప్రాణాలు కాపాడేందు కు ప్రభుత్వం చేస్తున్న ముమ్మర ప్రయత్నా లు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.