20-02-2025 12:00:00 AM
టాలీవుడ్‌కి ఓ కెరటంలా దూసుకొచ్చింది శ్రీలీల. ఈ ముద్దుగుమ్మ చేసిన తొలి చిత్రం డిజాస్టర్ అయినా కూడా అమ్మడికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. వరుస అవకాశాలు వరించాయి. చిన్న, పెద్ద హీరోలతో సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. టాలీవుడ్‌లో ఇప్పుడు అమ్మడికి చేతినిండా సినిమాలున్నాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో అవకాశాలు చేజిక్కించుకునే పనిలో ఉంది. అవకాశం అయితే దక్కింది కానీ రెమ్యూనరేషనే మరీ దారుణమని తెలుస్తోంది. స్టార్ హీరో సరసన అవకాశం వచ్చినా రెమ్యూనరేషన్ మాత్రం టాలీవుడ్‌తో పోలిస్తే తక్కువని సమాచారం. అయినా సరే.. బాలీవుడ్‌లో అవకాశం దొరకడమే గగనం అనుకుందో ఏమో కానీ ఓకే చెప్పేసింది.
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైందట. తొలుత ఈ పాత్రకు త్రిప్తి డిమ్రీ ఎంపికైందట. కానీ తరువాత ఎందుకో ఆమెను సైడ్ చేసి శ్రీలీలను మేకర్స్ ఫైనల్ చేశారని టాక్. అయితే శ్రీలీల రెమ్యూనరేషన్‌పై ఆసక్తికర ప్రచారం నడుస్తోంది.
టాలీవుడ్‌లో రూ.2 కోట్ల పారితోషికం తీసుకుంటున్న శ్రీలీల బాలీవుడ్ సినిమాకు డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ శ్రీలీల తన మొదటి బాలీవుడ్ చిత్రానికి కేవలం రూ.1.75 కోట్లే తీసుకుంటోందని సమాచారం.