- 2025-26 బడ్జెట్‌కు ఆర్థిక శాఖ శ్రీకారం
- ఈ ఆర్థిక సంవత్సరంలో చేసిన ఖర్చెంత?
- వచ్చే ఏడాది వ్యయం ప్రతిపాదనలు ఎంత?
- విభాగాల వారీగా ఉన్న అప్పులెన్ని? ఆస్తులెన్ని?
- శాఖల వారీగా నివేదికలను కోరిన ఫైనాన్స్ విభాగం
- అంచనాల తయారీలో నిమగ్నమైన అధికారులు
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): నూతన సంవత్సరం వేళ కొత్త బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దు ను రూపొందించే పనిని ఆర్థిక శాఖ మొదలు పెట్టింది. ఈ మేరకు బడ్జెట్ రూపకల్పన కోసం అంచనాలను పంపాలని అన్ని విభాగాలను ఆదేశించింది.
దీంతో బుధవారం నుంచి ఆయా విభాగాలు ఆన్‌లైన్‌లో తమ అంచనాలను ఫైనాన్స్ డిపార్డ్ మెంట్‌కు పంపడంలో నిమగ్నమయ్యాయి. ఈ నెల 4న క్యాబినెట్ భేటీ ఉన్నందుకు ఆలోపే అంచనాలను పంపాలని ఆర్థికశాఖ స్పష్టంచేసింది.
2025 బడ్జెట్ అంచనాలనే కాకుండా, ఇప్పటివరకు ప్రభుత్వం దేనికోసం ఎంత ఖర్చు పెట్టింది? ఇందులో నిర్వహణ వ్యయం ఎంత? పథకాల కోసం చేసిన ఖర్చు ఎంత? ఇలా ప్రతి అంశాలన్ని సవరివరంగా https://ifmis. telangana. gov.in పోర్టల్‌లో పొందుపర్చాలని ఆదేశించింది.
నియామకాలెన్ని? ఖాళీలు ఎన్ని?
సమర్థమైన పాలన అందించ డం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను కల్పించ డం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, అసమానతలను తగ్గించడం, ఆర్థిక నిల్వలు, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
విభాగాల అధిపతులు తమ అంచనాలతోపాటు ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదికను తయారు చేసి.. ఒక కాపీని ఆర్థిక శాఖకు, ఇంకో కాపీని అడ్మిస్ట్రేషన్ శాఖకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్, రెగ్యులర్ ఇలా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనాల వివరాలను పంపాలని స్పష్టంచేసింది.
జాబితాలో వివరాలను చేర్చని పక్షంలో తర్వాత ఆర్థిక సంవత్సరంలో పరిగణలోకి తీసుకోదని చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎంతమం ది ఉద్యోగులను నియమించాలని అనుకుంటున్నారు? ఏ క్యాడర్‌లో నియామకాలు ఉం టాయి? కొత్తగా మంజూరైన లేదా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంత? ఇలా అన్ని వివరాలను ఆర్థిక శాఖ కోరింది.
అన్ని శాఖల అధిపతులు ఈ వివరాలను 4వ తేదీ నాటికి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ పోర్టల్ ద్వారా ఆర్థిక శాఖకు పెంపాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
కొత్త పథకాలు ఉంటాయా?
2025 సంవత్సరంలో కొత్త పథకాలు ఉంటాయా? ఒకవేళ ఉంటే, ప్రవేశపెట్టే పథకాల అంచనా వ్యయాన్ని బడ్జెట్‌లో ప్రతిపాదించాలని ఆయా విభాగాలను ఆర్థిక శాఖ కోరింది. అలాగే, ఉద్యోగులు ఇచ్చే జీతాలు, అద్దెలు, వచ్చే ఏడాది చేపట్టబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? రాష్ట్రానికి కేంద్రం ఎంత గ్రాంట్లను విడుదల చేసిందన్న వివరాలను అందించాలని చెప్పింది.
నాలుగో తేదీలోపు ప్రతిపాదలను పంపిన తర్వాత.. వాటిని పరిశీలించి అవి సరిగా లేకుంటే, మళ్లీ అంచ నాలను కోరుతామని ఆర్థికశాఖ స్పష్టంచేసింది. ప్రతిపాదనల రూపకల్పనలో అధికా రులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
పెంచుతారా? తగ్గిస్తారా? అప్పులెన్ని?
ఆయా విభాగాల్లో వచ్చే ఏడాది ఎంత రాబడిని ఆశిస్తున్నారు? ఆదా యం తెచ్చే శాఖల్లో లీకేజీని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలేంటి? ధరలు పెంచే, తగ్గించే ఆలోచన ఉన్న శాఖలు ఆ వివరాలను ప్రతిపాదనల్లో వెల్లడించాలని ఆర్థికశాఖ పేర్కొంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా భారీగా అప్పులను తీసుకొచ్చింది.
స్పెషల్ పర్సస్ వెహికిల్ పద్ధతిలో మరికొన్ని రుణాలను తీసుకుంది. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్యారెంటీలను పెట్టి కొన్ని రుణాలను తీసుకుంది. ఈ ఏడాది పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా తీర్చుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఉన్న అప్పు లు ఎంత? వడ్డీలు, అసలు రూపంలో కట్టింది ఎంత? అన్న వివరాలను ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించింది.
గత ప్రభుత్వంలాగా అప్పులను దాచొద్దంటూ సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశిం చిన నేపథ్యంలో పారదర్శకంగా ఉండేందుకు రుణాల వివరాలను సైతం వెల్ల డించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. అంతేకాకుండా, డిపార్ట్‌మెంట్లు, కార్పొరేషన్లతో పాటు ఇతర విభాగాల వద్ద ఉన్న ఆస్తుల వివరాలను కూడా ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని చెప్పింది.
అంతేకాకుండా విభాగాల వారీగా ఉద్యోగుల వివరాలను కూడా అడిగినట్టు తెలిసింది. అలాగే, భవిష్యత్‌లో డిపార్ట్‌మెం ట్లలో జౌట్ సోర్సింగ్ లేక రెగ్యులర్ ఉద్యోగుల నియామకం ఉంటుందా? ఆ వివరాలను ఆర్థిక శాఖ అడిగినట్టు సమాచారం.