calender_icon.png 15 November, 2024 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుకూలమా? వ్యతిరేకమా?

10-11-2024 01:42:15 AM

  1. బీసీ కులగణనపై బీజేపీ నాయకులకు మంత్రి పొన్నం సూటి ప్రశ్న
  2. ఎంపీ లక్ష్మణ్ తీరు చూస్తుంటే బీజేపీ వ్యతిరేకంగా తోస్తోందన్న మంత్రి

హైదరాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): బీసీ కులగణనకు బీజేపీ అనుకూ లమా? వ్యతిరేకమా? సమాధానం చెప్పాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలు చూస్తే బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుందన్నారు.

శనివారం గాంధీ భవన్‌లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి కాంగ్రెస్ బీసీలకు అనుకూలమని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలో వద్దో ఎంపీ లక్ష్మణ్ సమాధా నం చెప్పాలన్నారు. కులగణనపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులగణనకు వ్యతిరేకంగా బీజేపీ సుప్రీంకోర్టులో అఫిడ్‌విట్ వేసిందన్నారు.

బీసీ రిజర్వేషన్ల అంశంపై బీజేపీలో మోదీ ఒకలా, అమిత్‌షా మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో బీసీ అయిన బీజేపీ అధ్యక్షున్ని తొలగించి అగ్రవర్ణాలకు కట్టబెట్టరాని, ఎల్పీ నేతనూ  అగ్రవ ర్ణాల నుంచే ఎన్నుకున్నారున్నారు. ప్రభు త్వం సేకరిస్తున్న సమాచారం గోప్యంగా ఉంటుందన్నారు. కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.  

కేంద్రంలో ముగ్గురే బీసీ ఐఏఎస్‌లు..

యూపీఎస్సీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 22.5 శాతం రిజర్వేషన్లు దాటడం లేదని, ఇందుకు మోదీ విధానాలే కారణమని పొ న్నం అన్నారు. కేంద్రంలో 90 మంది ఐఏఎస్‌లు ఉంటే అందులో ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారని, బీజేపీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి అని విమర్శించారు.