ఫొగాట్ కేసులో నేడు కాస్ తీర్పు
పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేసు కు సంబంధించిన తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) నేడు వెలువరించ నుంది. అనర్హత వేటుకు సంబంధించిన అప్పీల్‌లోనే తనకు రజత పతకం ఇవ్వాలని వినేశ్ అభ్యర్థన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినేశ్ విషయంలో తీర్పు ఎలా వస్తుందనేది ఆసక్తిగా మారింది. అంతకముందు బరువు తగ్గకపోవడానికి సంబం ధించిన కారణాలపై సోమవారం కాస్ ఎదు ట వినేశ్ కౌన్సిల్ తన వాదనలు వినిపించింది. ‘బిజీ షెడ్యూల్, అథ్లెట్లు బస చేసే ప్రాంతానికి, పోటీలు జరిగే ప్రాంతానికి మధ్య ఉన్న దూరం’ తన బరువును తగ్గించుకునేందుకు ఆటంకాలుగా మారాయి.
100 గ్రాముల బరువు అనేది పెద్ద విషయం కాదు. ఈ ఎండాకాలం వాతావరణ పరిస్థితుల్లో సులభంగా బరువు పెరుగుతుంది. వేడి వాతావరణం వల్ల మన శరీరం అధిక నీటిని తీసుకుంటుంది. దీని వల్ల కూడా బరు వు పెరిగే అవకాశం ఉంది. ఒకే రోజు మూడు సార్లు పోటీ పడాల్సి వచ్చింది. బరు వు పెరిగేందుకు ఇది కూడా ఒక కారణం’ అని వినేశ్ కోర్టుకు తెలిపింది. ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేవ్ ఫొగాట్ తుది పోరుకు ముందు వంద గ్రాములు అధిక బరువు ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈసారి రెజ్లింగ్‌లో అమన్ కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే.