వైద్యం చేయకుండానే చేసినట్టుగా చూపిస్తూ ఉత్తుత్తి బిల్లులు సమర్పించి కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి లూఠీ చేసినట్లుగా వచ్చిన వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఇది కూడా బీఆరెస్ సర్కార్ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంలో 28 హాస్పటల్స్‌పై సీఐడీ కేసులు నమోదు చేసిందంటే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఈ దందాలో ఖమ్మం దవాఖానలు టాప్‌లో ఉన్నాయట. ఇలాంటి వాటివల్ల అసలైన బాధితులకు సొమ్ము అందకుండా పోతుంది. బాధ్యులైన అధికారులపై తీవ్రస్థాయిలో చర్యలు వుంటే తప్ప ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా ఉంటాయి.
డి.సాయితేజ, బోడుప్పల్