calender_icon.png 14 November, 2024 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికలకు భద్రతేదీ

10-11-2024 12:25:26 AM

  1. పాఠశాలల్లోనే లైగింక వేధింపులు
  2. ఉపాధ్యాయులపై -పోక్సో కేసులు
  3. సిరిసిల్లలో మరో ఉపాధ్యాయుడిపై కేసు

సిరిసిల్ల, నవంబర్ 9 (విజయక్రాంతి): పాఠశాలలో బాలికలకు భద్రతలేకుండా పోతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకలుగా మారుతున్నారు. సిరిసిల్ల జిల్లాలో వరుస ఘటనలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 15 రోజుల క్రితం ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు అరెస్టు చేశాడు.

ఈ ఘటన మరువకముందే శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడనే ఆరోపణతో షీ టీం కేసు నమోదు చేసింది. ఇదే పట్టణంలో గీతానగర్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నరేందర్‌పై పోక్సో నమోదు చేసి జైలుకు పంపారు. 

2023లో 38 పోక్సో కేసులు

2023లో సిరిసిల్ల జిల్లాలో పోక్సో కేసులు 38 నమోదయ్యాయి. మహిళలను వేధించిన కేసులు 25 ఉండగా, పీటీ కేసులు 14 నమోదు అయ్యాయి. 2024లో పోక్సో కేసులు 41 వరకు నమోదయ్యాయి. అందులో ఉపాధ్యాయులపై రెండు కేసులు నమోదు కావడం ఆందోళనకర విషయం. మహిళలను వేధించినందుకు 44 కేసులు నమోదయ్యాయి. పీటీ కేసులు 57 వరకు నమోదయ్యాయి. గతేడాది కంటే ఈసారి అధికంగా కేసులు నమోదయ్యాయి. 


బాలికలను వేధిస్తే కఠిన చర్యలు 

 అఖిల్ మహాజన్, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల జిల్లా

బాలికలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాలికలు, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం నిరంతరం షీటీంలు పని చేస్తున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం జ్వాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వేధింపులకు గురైనపుడు ధైర్యం కోల్పోకుండా పోలీసులకు సమాచారం అందించాలి.