- కబ్జా ఒక చోట, కంచె మరో చోట
- పారెస్ట్ అధికారి చర్యలతో విస్తుపోయిన స్థానికులు
- కంచె ఏర్పాటుకు నిధులు లేవన్న అధికారి
- కబ్జాదారులకు అండగా నిలిచిన ఆఫీసర్
- కలెక్టరు ఫిర్యాదు చేస్తామన్న స్థానికులు
కోనరావుపేట, డిసెంబర్ 29 : భూ బకాసురులను నుంచి భూరవ్వు కుంటకు విముక్తి కలిగేనా? అనే అనుమానులు కలు గుతున్నాయి. కోనరావుపేట మండలం వట్టిమల్ల గొల్లపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఉన్న భూరవ్వకుంటను కొందరు కబ్జా దారులు అక్రమించుకోని, చదును చేశారు. దీంతో ‘అటవీ కుంట’ అనే శీర్షికను విజయక్రాంతి దినపత్రికలో ప్రచురితమైంది.
స్పందించిన ఉన్నతాధికా రుల ఆదేశాలతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఆన్వర్ సంఘటన స్థలానికి జేసీపీతో తరలి వెళ్లారు. అయితే 15 ఎకరాల్లో కుంటను ఉండగా, అందులో దాదాపు 14 ఎకరాల వరకు కుంటను అక్రమణదారులు అక్ర మించుకున్నారు. దీంతో ఉన్న ఎకరం భూమికి మాత్రమే కందకం తవ్వి కంచె ఏర్పాటు చేస్తామని అటవీ అధికారి చెప్పపడంతో స్థానికులు విస్తుపోయారు.
కబ్జా అయిన భూమిని కాపాడా ల్సిన అధికారే ఏకంగా కబ్జాదా రులకు అండగా నిలవడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారని స్థానికులు సదరు అధికారిని ప్రశ్నిస్తే, కంచె ఏర్పాటుకు ఆఫీస్‌లో డబ్బులు లేవని, కలెక్టర్ ఇంతవరకే కంచె ఏర్పాటు చేయాలని చెప్పారని తెలపడంతో స్థానికు లు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయమై ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు ఫిర్యాదు చేస్తామన్నారు.
అయితే కొన్నేళ్లుగా అటవీ అధికారులు కుంటను కాపాడుతుండగా, ఈ అధికారి రావడంతో నే కుంటను ఫలహారంలా పంచు కునేం దుకు సహకరించడంపై స్థానికులు ఆం దోళన వ్యక్తం చేస్తున్నా రు. అటవీసంపదను కాపాడాల్సి న అధికారే అక్రమణదా రులకు అండగా నిలవడం, ఉన్నతాధికారులు ఈఘట నపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకో వడం తోపాటు కుంట భూమిని కాపాడాలని వారు కోరుతున్నారు.