23-03-2025 12:59:28 AM
బండి సంజయ్‌పై కాంగ్రెస్ ఎంపీ చామల ఫైర్
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): తమిళనాడులో నిర్వహించిన డీలిమిటేషన్ సమావేశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ చిల్లరగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
డీలిమిటేషన్ సమావేశం దొంగల ముఠా అనుకుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి పోలీసులను అక్కడికి పంపి ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. శనివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందన్నారు.
డీలిమిటేషన్ సమావేశంపై కేటీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను పొగుడుతున్నారని, కానీ అంతకు ముందే లేఖలు రాసిన జానారెడ్డి, భట్టివిక్రమార్కను పొగడటానికి నోరేందుకు రాలేదన్నారు. నిధులు ఇస్తే కాంగ్రెస్‌కు క్రెడిట్ వస్తుందనే.. కిషన్‌రెడ్డి రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.