పీసీసీ చీఫ్ పోస్టు కోసం పోటా పోటీ
ఈ నెలలోనే కొత్త చీఫ్ నియామకం
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల కోసం పోటీ పెరుగుతోంది. పీసీసీ అధ్యక్ష పదవితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, నామినేటెడ్ పోస్టుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరు భావించారు.
కానీ సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు, సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనతో వాయిదా పడింది. రేవంత్ విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశానికి రానునున్నారు. మరుసటి రోజు స్వా తంత్య్ర వేడుకల్లో పాల్గొన్న తర్వాత సీఎం, పీసీసీ హోదా లో పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెప్తున్నాయి. కొత్త పీసీసీ చీఫ్‌తోపాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఢిల్లీ పెద్దలతో చర్చించి వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా చెప్తున్నాయి.
నలుగురి మధ్యే పోటీ!
పీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ప్రధానంగా నలుగురు మధ్యే పోటీ నెలకొన్నది. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ పోటీ పడుతున్నారు. ఈ నలుగురు నాయకులు పీసీసీ కోసం పార్టీ అధిష్ఠానం వద్ద వేర్వేరుగా లాబీయింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో కొత్తగా ఎంపికయ్యే అధ్యక్షుడు సీఎం రేవంత్‌రెడ్డితో సమ న్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నందున ఈ నలుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియని ఆయోమ య పరిస్థితి నెలకొన్నది. అయితే రేవంత్ ఈ నలుగురిలో ఎవరివైపు మొగ్గు చూపుతార న్న ఉత్కంఠతో అంతా ఎదురుచూస్తున్నారు.
ప్రచార కమిటీ చైర్మన్‌గా జగ్గారెడ్డి?
ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుత్ను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి ఉండటంతో పీసీసీ చీఫ్ పదవీ రెడ్డి వర్గం కానివా రికి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగిస్తారని టాక్. అప్పటికప్పుడు జన సమీకరణ చేయడంలో జగ్గారెడ్డి సఫలీకృతుడవుతారనే పేరున్నది. ఇది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టిలో కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగ్గారెడ్డికి పార్టీ ప్రచార కమిటీ పగ్గాలు అప్పగిస్తారనే ప్రచా రం జరుగుతుంది.
ఆ పదవి కోసం వీహెచ్
పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత కూడా పార్టీ పదవీ కోసం ఢిల్లీ లోని పార్టీ పెద్దలను కలిశారు. ఓబీసీ సెల్ జాతీయ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ సీటును వీహెచ్ ఆశించారు. రెండు, మూడే ళ్లు ఖమ్మంలో జరిగిన పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యారు. చివరకు వీహెచ్‌కు టికెట్ దక్కలేదు. అయినప్పటికీ పార్టీ విజయం కోసం వీహెచ్ పనిచేశారు. నిత్యం బీసీల సమస్యల కోసం కొట్లాడే వీహెచ్ జాతీయ స్థాయిలో ఓబీసీ సెల్ పదవీ ఇస్తే మరింతగా పార్టీ కోసం పనిచేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు.
ఢిల్లీ చుట్టూ ఆశావాహులు
జాతీయ స్థాయిలో త్వరలోనే ఏఐసీసీ కార్యవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ఏఐసీసీ పదవుల కోసం రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర వేణుగోపాల్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెండ్ జెట్టి కుసుమకుమార్ ఏఐసీసీ కార్యదర్శి పదవుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తర ణలో సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకుంటే ఎమ్మెల్యే కోమ టిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, లేదంటే మల్‌రెడ్డి రంగారెడ్డికు ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్
పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నందున ఎమ్మెల్సీ మహే శ్‌కుమార్‌గౌడ్ తనకే పీసీసీ చీఫ్ పదవి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా రు. ఏఐసీసీ కార్యదర్శిగా, ఢిల్లీ పెద్దలతో తనకున్న సంబం ధాలను దృష్టిలో పెట్టుకుని తనకే పీసీసీ అధ్యక్ష పదవి వచ్చి తీరుతుందని సంపత్‌కుమార్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మహ బూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ కూడా పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలు స్తోంది. ఇప్పటివరకు ఎస్టీ వర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని చెబుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉన్న మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడా పార్టీ అధ్యక్ష పదవీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంకగాంధీలతో సత్ససంబంధాలు ఉండటంతో తనకు వస్తుందనే ధీమాతో ఉన్నారు. దీపాదాస్, రేవంత్‌రెడ్డి సిఫార్సు చేస్తే పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఖాయమన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక జరిగితే సామాజిక సమీకరణాల వారీగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నలుగురిని నియమించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకటి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి దక్కుతుందని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మిగిలిన మూడు పోస్టులకు ఒకటి ఎస్సీ సామాజిక వర్గానికి, ఒకటి ఎస్టీ, బీసీలోని యాదవ వర్గం నుంచి ఒకరు, మరొకటి మైనార్టీ సామాజిక వర్గానికి పదవులు దక్కుతాయని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.