calender_icon.png 17 March, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయ పోరాటం చేస్తే అక్రమ అరెస్టులా?

17-03-2025 12:25:24 AM

నిర్బంధాలతో ఆకాంక్షలను అణచివేయలేరు

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగల్ల ఉపేందర్ మాదిగ

జనగామ, మార్చి 16(విజయ క్రాంతి): ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులను సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు. జనగామలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యక ర్తలను ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసి స్తూ ఎం ఎస్ పి జనగామ జిల్లా అధ్యక్షులు గద్దల కిషోర్ మాదిగ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఉపేందర్ మాట్లాడారు. వారం రో జులుగా దీక్షలో ఉన్న వారిని నిర్బంధంలో పెట్టడమే ప్రజా పాలననా అని ప్రశ్నించారు. ఈ  విధానాల వలన ప్రజాస్వామిక విలువల వైపుకు నడుస్తున్నారా లేక నియం తృత్వం వైపుకు అడుగులేస్తున్నారో గ్రహించాలని హితవు పలికారు. ఎలాంటి ముంద స్తు పిలుపులు లేకున్నా అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు దిగడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.

ఎమ్మార్పీఎస్ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ అమలుపై ఇచ్చిన మాటకు కట్టుబడకుండా న్యాయాన్ని తొక్కిపెట్టి ఎక్కువ కాలం పాలన కొనసాగిం చలేరని, ఎస్సీ వర్గీకరణను అమలు చేయకపోతే తన పతనాన్ని తానే కొనితెచ్చుకున్నట్టు అవుతుందని గుర్తు చేశారు. చైతన్యము పోరాట స్ఫూర్తి కల్గిన తెలంగాణ గడ్డ మీద ప్రభుత్వం తమ అప్రజాస్వామీక విధానాలను మానుకోకపోతే హీనులుగా మిగిలి పోతారని అన్నారు. ముఖ్యమంత్రి స్పం దించి ఎస్సి వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విడుదల చేసిన ఉద్యోగ పరీక్ష ఫలితాలకు కూడా వర్తించేలా సంపూర్ణమైన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చి తక్షణమే అమలు చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి సందేన రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల మహేష్ మా దిగ, ఎంఎస్పి జిల్లా సీనియర్ నాయకులు గువ్వల రవి తదితరులు పాల్గొన్నారు