calender_icon.png 19 January, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహేశ్ సినిమా కోసమేనా?

18-01-2025 12:00:00 AM

మహేశ్ బాబు, రాజమౌళి చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ‘ఎస్‌ఎస్‌ఎంబీ79’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా సైలెంట్‌గా పూజా కార్యక్రమాలు జరుపుకొంది. సెట్స్‌పైకి ఎప్పుడు వెళుతుందా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వార్త ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోందంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఆమె లాస్ ఏంజెల్స్ నుంచి ఇండియాకు చేరుకున్నారు. తాజాగా హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ‘ఎస్‌ఎస్‌ఎంబీ 79’ ప్రాజెక్ట్ కోసమే హైదరాబాద్ వచ్చారని అంతా అనుకుంటున్నారు. ఆమె విమానంలో ప్రయాణిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీంతో సినిమా త్వరలోనే పట్టాలెక్కుతుందని అంతా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారమూ బయటకు రాని సినిమా కథ అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది.  భారతీయ భాషలతో విదేశీ భాషల్లోనూ అనువాదం కానున్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు అంచనాలను రెట్టింపు చేశాయి. తమన్ సైతం  చిత్రం బాక్సాఫీస్ లెక్కలను ఎవరూ అంచనా వేయలేరంటూ వ్యాఖ్యానించి మహేశ్ అభిమానుల్లో జోష్ నింపారు.