ఎక్స్ వేదికగా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): అఖండ భారతదేశంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? అంటా ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. జైలు నుంచి విడుదల అయ్యాక గురువారం ఎక్స్ వేదికగా అదానీ వ్యవహారంపై తొలిసారి ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీతోపాటు ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ.. అదానీ వైపే ఉన్నారన్నారు. ఆడబిడ్డను కాబట్టి ఆధారాలు లేకున్నా అరెస్ట్ చేయడం కేంద్ర పాలకులకు సులభమని, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం కష్టమా? అంటూ ప్రధానిని ప్రశ్నించారు.