calender_icon.png 20 March, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనైపోతే సరిపోతుందా?

20-03-2025 12:47:20 AM

  • లూస్‌గా 33 కేవీ విద్యుత్ లైన్ గుంజుతున్న వైనం 

విరిగిన స్టట్ పోల్స్... పలుచోట్ల వంగిన లైన్ పోల్స్ 

గాదిర్యాల సమీపంలోని ప్రధాన స్టబుల్ టేషన్ నుంచి మహమ్మదాబాద్, వెంకటరెడ్డి పల్లి వరకు లాగుతున్న 33 కేవీ లైన్ 

ప్రత్యేక విభాగం ఉంది పర్యవేక్షణ చేస్తది.. మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి : విద్యుత్ శాఖ ఎస్‌ఈ

మహబూబ్ నగర్ మార్చి 18 (విజయ క్రాంతి) : ప్రభుత్వ పని ఎలాగో అలాగా సరిపోతుందా.. అధికారులను మెయింటెన్ చేసి నిబంధనలు ఎన్ని ఉన్నా మిగులే ముఖ్యమనే విధంగా ముందుకు ముందుకు సాగుతారు కొందరు కాంట్రాక్టర్లు. పని ఏదైనా ఆ పనిలో ఎంత మిగులుతుంది అని లెక్కలు మాత్రం కొందరు కాంట్రాక్టర్లు పక్కాగా అంచనా వేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తారు.

ఇది నిజమే అయినప్పటికీ చాలామంది ఒప్పుకోరు గాక ఒప్పుకోరు. ప్రతి ఒక్కరు చేసే పనిలో 19 చూస్తారు. కానీ ఆ పని పరిపక్వత ఎంతవరకు ఉందనేది కూడా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గాదిరాల సమీపంలోని ప్రధాన స్టబు ల్ టేషన్ నుంచి మరో స్టెబిలిటేషన్లు ఏర్పాటు చేసేందుకు మహమ్మదాబాద్, వెంకటరెడ్డి పల్లి వరకు 33 కెవి విద్యుత్ లైన్ తీయడం జరుగుతుంది. నేషనల్ హైవే 167 పక్కనే ఈ లైన్ వస్తుంది. కాగా అది నిబంధనలు మాత్రం ఈ లైన్ వేయడంలో పాటించ డం లేదని ఆరోపణలు బందుకున్నాయి. 

లూస్ గా వైట్ స్టింగింగ్...

విద్యుత్ స్టబుల్ స్టేషన్ కు మనసంతానం చేసేందుకు 33 కెవి లైన్ లాగడం జరుగుతుంది. పోల్ టు పోల్ విద్యుత్ స్టింగ్ కింగ్ చాలా స్టిఫ్ గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఇక్కడ మాత్రం వైర్ స్టింగింగ్ చాలా లూజ్ గా లాగుతున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో నూతనంగా ఈ లైన్ వేసినప్పటికీ 11 ఫీట్ల స్తంభాలు సైతం నిటారుగా లేకపోవడంతో పాటు వంగడం జరిగింది.

లక్షలాది రూపాయలు వెచ్చించి నూతనంగా విద్యుత్తులైన చేపడుతున్న అధికారుల పర్యవేక్షణ అంతత మాత్రమే ఉండడంతో పనులు నాసిరకంగా దర్శనమిస్తు న్నాయి. స్తంభాలు పాతడంలో కూడా కంకర బెడ్డు పైపైన కనిపిస్తుంది. నిబంధనం దూరంగా ఉండి ఎలా పడితే అలా పనులు చేయడం ద్వారా మునుముందు ఎన్నో ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

విరిగిన స్టట్ పోల్స్...

విద్యుత్తు లైన్ చాలా ప్రమాదకరమని అందరికి తెలిసిందే. విద్యుత్ లైన్ ఏర్పాటు చేయడంలో అధికారులు ప్రత్యేక చర్యలు కూడా ఎందుకు తీసుకుంటారు. నూతన లైవ్ ఏర్పాటు చేయడంలో నణ్యత మరింత అత్యధికంగా ఉండేలా చూడాలి. విద్యుత్తులైన ఏర్పాటు చేయడంలో ఉన్నత అధికారులు ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడంతోపాటు నాణ్యమైన పనులు చేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆదిశగా అడుగులు మాత్రం పడడం లేదు.

లోడు ఎక్కువ పడుతున్న సమయంలో కూడా విరిగిన స్తంభాలు వెయ్యడం జరుగుతుంది. లైన్ త్రూ కూడా సరిగా కనిపించడం లేదు. కొన్ని స్తంభాలు విరిగి పోవడంతో రోడ్డు పక్కనే పడేయడం జరిగింది. పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని ప్రజలు విద్యుత్ అధికారులను కోరుతున్నారు. ప్రతి పనిలోనూ పారదర్శకంగా ఉంటే భవిష్యత్ తరాలకు ఈ విద్యుత్ లైన్ ఎంత ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. 

మీ దృష్టికి వస్తే మాకు చెప్పండి.. పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం ఉంది..

గాదిర్యాల సమీపంలో ఉన్న స్టబుల్ స్టేషన్ నుంచి మహమ్మదాబాద్, వెంకటరెడ్డి పల్లి వరకు లాగుతున్న 33 కెవి లైన్ పనుల్లో ఎలాంటి నాణ్యత పండ్లు లోపించిన మా దృష్టికి తీసుకురండి. ఫోటోలు పెట్టిన మేము పరిధిలోకి తీసుకుంటాం.

ప్రత్యేక ఇంజనీర్ విభాగం ఈ లైన్ పై పర్యవేక్షణ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయిందుకు మరింత సమయం పడుతుంది. పారదర్శకంగా పనులు చేయించడం జరుగుతుంది. 

పీవీ రమేష్,విద్యుత్ శాఖ ఎస్ ఈ, మహబూబ్ నగర్ జిల్లా