calender_icon.png 13 February, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివలింగామయ్యా..

11-02-2025 12:00:00 AM

‘తెలివి కన్ను తెరుచుకుందయ్యా.. శివలింగామయ్యా.. మనసు నిన్ను తెలుసుకుందయ్యా.. మాయగంతలు తి య్యా..’ అంటూ సాగుతున్న ఆ పాట ఆద్యంతం భక్తి సాగరంలో ఓలలాడింపజేస్తోంది. టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ‘కన్నప్ప’ చిత్రంలోనిదే ఈ పాట. విష్ణు ప్రధాన పాత్రలో దర్శకుడు ముఖేశ్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని ‘శివా శివా శంకరా..’ గీతాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ గురూజీ విడుదల చేశారు.

సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ సాంగ్ లింక్‌ను షేర్ చేశారు విష్ణు. పాట సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా, స్టీఫెన్ దేవస్సీ సంగీత సారథ్యంలో విజయ్ ప్రకాశ్ పాడారు. మోహన్‌బాబు, ప్రభాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది.