07-02-2025 12:34:10 AM
ఖమ్మం, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగుల్లో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతంతో పాటు ఆకేరు, పాలేరు నదుల నుంచి అక్రమార్కులు పెద్ద ఎత్తున ఇసుకను తవ్వుతూ తరలించుకుపోతున్నారు. ఇదంతా మైనింగ్, పోలీస్, రెవె శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ముడు అందు ఏ ఒక్కరూ కిక్కురుమనడం లేదనే ఆరోపణలు వెల్లు
పాలేరు వాగులో తవ్వకాలు
పాలేరు ఏటిలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పాలేరు పరివాహక ప్రాంతాల్లో భారీగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. రాత్రిళ్లూ పాలేరు వాగు నుంచి వందలాది ట్రిప్పుల ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లు వేగంగా వెళ్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలు ఇళ్ల ముందు నుంచి నడవాలంటేనే భయపడిపోతున్నారు.
కొన్ని ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు కూడా ఉండటం లేదు. కాకరవాయి, బీరోలు, కూడలి రాయపాడు, మోతే గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ద్వారా ఇసుకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సూర్యాపేట జిల్లా మోతీ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడ నుంచి ఇసుక తరలిస్తున్నారని తెలుస్తున్నది.
తవ్వకాలతో నీటి ఎద్దడి
సీసీ రోడ్ల పేరుతో ఇసుక దోపిడీ చేస్తున్న తెలుస్తున్నది. తిరుమలాయపాలెం మం ఇసుక వ్యాపారం భారీగా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. కూలీలను పె మరీ పెద్ద ఎత్తున ఇసుకను తోడుకెళ్లడంతో వేసవిలో నీటి ఎద్దడి అధికమయ్యే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు పడిపో నీటి ఎద్దడి ఏర్పడటంతో పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది.
అడ్డగోలుగా ఇసుక డంపులు
ఖమ్మం నగరంలోని అల్లీపురం రోడ్డు, సారధినగర్ ఏరియా, దానవాయిగూడెం వంతెన వద్ద, బైపాస్ రోడ్డు, ఇందిరానగర్, గొల్లగూడెం ఏరియా, మమత ఆస్పత్రి రోడ్డులో అడ్డగోలుగా ఇసుకను డంపు చేస్తున్నారు. బహిరంగంగానే ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తెచ్చి, డంపులు ఏర్పాటు చేస్తున్నారు. నగర కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
అక్రమార్కులు ట్రాక్టర్ ఇసుక రూ.8 వేలకు పైగానే వసూలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నగర పాలక సంస్థకు పన్ను చెల్లించకుండానే అక్రమార్కులు దోపిడీకి తెరలేపారు. ఖమ్మం రూరల్ మండలం, తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు నుంచి కూడా భారీ ఎత్తున ఇసుకను తవ్వుతున్నారు.